Home » Entertainment » Rashmika Mandanna About Shooting Gap Activities
Entertainment

Rashmika Mandanna : ఆ సమయంలో నేను చేసే పనులివే : రష్మిక మందన్నా

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 17, 2021, 6:50 pm
Advertisement

Rashmika Mandanna ఛలో బ్యూటీ రష్మిక మందన్నా Rashmika Mandanna సోషల్ మీడియాలో చేసే అల్లరికి కుర్రకారు ఫిదా అవుతుంటారు. చిన్న పిల్లలా ఆమె చేసే చేష్టలు, పెట్టే పోజులు అందరినీ ఆకట్టుకుంటాయి. రష్మికకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. ఇన్ స్టాగ్రాంలో రష్మిక ఫాలోయింగ్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అతి తక్కువ కాలంలోనే 20 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తాజాగా రష్మిక షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంది.

Advertisement

Rashmika Mandanna About Shooting Gap Activities

ఆ సమయంలో నేను చేసే పనులివే : రష్మిక మందన్నా Rashmika Mandanna

బాలీవుడ్‌లో రెండు మూడు ప్రాజెక్ట్‌లు, తెలుగులో రెండు ప్రాజెక్ట్‌ల్లో రష్మిక నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, సిద్దార్థ్ మల్హోత్ర వంటి వారి పక్కన రష్మిక నటిస్తోంది. ఇక తెలుగులో అయితే పుష్ప, ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా రష్మిక Rashmika Mandanna ఓ కొంటె పనిని చేసింది. రకరకాల ఫోటోలను దిగి వాటిని నెట్టింట్లో షేర్ చేసింది. అందులో మీకు (అభిమానులు) ఏ ఫోటో నచ్చిందని రష్మీ అడిగేసింది. అయితే ఇందులో రష్మిక ఓ కామెంట్ చేసింది.

Advertisement

rashimika mandanna

మామూలుగా అయితే షూటింగ్‌లో హీరో హీరోయిన్లు గ్యాప్ దొరికితే.. కొందరు బుక్స్ చదువుతుంటారు. ఇంకొందరు ముచ్చట్లు పెడుతుంటారు. అయితే రష్మిక మాత్రం షూటింగ్ గ్యాప్‌లో చేసే పనులను చెప్పేసింది. ఈ మూడు ఫోటోల్లో మీకు ఏది నచ్చింది.. మామూలుగా నాకు షూటింగ్‌లో గ్యాప్ దొరికితే చేసే పనులివే. ఇలానే ఫోటోలు పిచ్చిపిచ్చిగా దిగుతాను అని చెప్పకనే చెప్పేసింది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ ఫోటోలు, ఆ మల్లెపూలు తెగ వైరల్ అవుతున్నాయి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి