Rashmika Mandanna : ఇంత వికారంగా ఉన్నా డేట్‌కు వస్తారా?.. రష్మిక బంపర్ ఆఫర్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 18 October 2021, 7:30 pm

Rashmika Mandanna : రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తెరపై తన పాత్రల్లో ఎంత అల్లరి చేస్తుంటుందో.. బయటకు అంతకు మించి అనేలా ఉంటుంది. ఆమె చేసే అల్లరి, కొంటె చేష్టలు, పోస్ట్ చేసే వెరైటీ ఫోటోలు, పెట్టే పోజులకు అందరూ పడిపోతోంటారు. అలా సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పని చేస్తూ తన అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా రష్మిక మాత్రం నెటిజన్లతో ముచ్చట్లు పెడుతుంది.

rashmika mandanna animated pic

rashmika mandanna animated pic

అభిమానుల కోసం రష్మిక సమయాన్ని కేటాయిస్తుంటుంది. ప్రస్తుతం రష్మిక ఎన్ని భాషల్లో ఎన్ని ప్రాజెక్ట్‌‌లు చేస్తోందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అంటూ రష్మిక తిరిగేస్తోంది. బాలీవుడ్‌లో అయితే వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్‌లు రెడీ చేస్తోంది. ఇక తెలుగులో అయితే ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ శర్వానంద్ రచ్చ చేస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక అదరగొట్టనుంది.

Rashmika Mandanna రష్మిక వెరైటీ పోస్ట్..

rashmika mandanna animated pic

rashmika mandanna animated pic

అలా సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. ఈ మధ్య నెట్టింట్లో అందరూ యానిమెటేడ్ వర్షన్‌లో కనిపిస్తున్నారు. కొందరు వికారంగా, ఇంకొందరు డిస్నీ బొమ్మల్లా మారిపోయి ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. అలా రష్మిక తాజాగా బార్బీ డాల్‌లా మారిపోయింది. ఇలా ఉంటే.. ఇంత వెరైటీగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే కూడా నాతో డేట్‌కు వస్తారా? అని పోల్ పెట్టేసింది. అందులో దాదాపు 80 శాతానికి పైగా అందరూ రెడీ అని అనేశారు.

rashmika mandanna animated pic

rashmika mandanna animated pic

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp