Anchor Pradeep : బిల్డప్ బోలెడంత ఇచ్చారు!.. యాంకర్ ప్రదీప్ సక్సెస్ అవ్వగలడా?
Anchor Pradeep : బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలు క్లిక్ అవ్వడమే గగనంగా మారింది. అలా కిందా మీద పడుతూ కామెడీ స్టార్స్ లేస్తోంది. జబర్దస్త్ వంటి షోలు ఎప్పటి నుంచో ఉండటంతో అవి కాస్త నిలకడగానే సాగుతున్నాయి. బుల్లితెరపైనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ షోల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆహా షోలో కొత్తగా చేస్తోన్న షోలన్నీ కూడా బెడిసి కొట్టేస్తున్నాయి. ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించిన సామ్ జామ్ షో దారుణంగా ఫ్లాప్ అయింది.

Anchor Pradeep Sarkaar Show on aha App
మంచు లక్ష్మీ ఆహా భోజనంబు షో, రానా నెంబర్ వన్ యారీ షో ఇవేవీ కూడా క్లిక్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆహా టీం కొత్త షోలను ప్లాన్ చేసింది. బాలకృష్ణతో అన్ స్టాపబుల్ అంటూ ఓ టాక్ షోను రెడీ చేసింది. అది దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రదీప్‌తోనూ ఓ షో ప్లాన్ చేసింది. అగస్త్య ఆర్ట్స్‌లో ఇంతకు ముందు అదిరింది, బొమ్మ అదిరింది అంటూ ప్రదీప్ రచ్చ చేశాడు. ఆ షో బెడిసికొట్టేసింది.
Anchor Pradeep : ఆహాలో ప్రదీప్ కొత్త షో :

Anchor Pradeep Sarkaar Show on aha App
అయితే ఇప్పుడు ఆహా యాప్ కోసం ఓ షోను ప్లాన్ చేశారు. సర్కార్ అంటూ రాబోతోన్న ఈ షోకు సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో ప్రదీప్‌కు పవన్ కళ్యాణ్‌కు ఇచ్చినంత బిల్డప్ ఇచ్చారు. బీపీకి టెన్షన్ పెట్టిస్తాడట.. ఐస్‌కు చెమటలు పట్టిస్తాడట.. క్లియర్‌ను కూడా కన్ఫ్యూజ్ చేసే క్లెవర్ అంటూ.. టవర్.. అంటూ ఇలా ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశారు. మరి ప్రదీప్ ఈ షోను ఏ మేరకు నడిపిస్తాడు.. అన్నది చూడాలి. అసలే ఆహా రీచ్ కూడా అంతంతమాత్రంగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే.