Samantha : అన్నింటిని మరిచిపోయిన సామ్.. నార్మల్ లైఫ్‌లోకి వచ్చేసిన సమంత
Samantha : సమంత ఇప్పుడు తన గతాన్ని మరిచిపోయింది. విడాకుల వ్యవహారాన్ని మరిచిపోయి ముందుకు అడుగులు వేస్తోంది. తన రొటీన్ లైఫ్లోకి సమంత వచ్చేసింది. ఇప్పటికీ రకరకాల కథనాలు బయటకువస్తున్నా.. వాటిని ఏ మాత్రం కూడా సమంత పట్టించుకోవడం లేదు. తన ఫోకస్ అంతా కూడా కెరీర్ మీదే పెట్టేసినట్టు కనిపిస్తోంది. ఇక తన పెట్ హష్‌ను కూడా తనతో పాటే ఉంచుకుంటోంది. హష్ అంటే నాగ చైతన్యకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.

samantha with hash and workouts
Samantha : అయితే ఇప్పుడు సమంత తన పెట్స్‌తో కలిసి ఆనందంగా గడిపేస్తోంది. తన పెట్స్‌ను అలా వాకింగ్ తీసుకెళ్తూ ఉంది. తన ఫ్రెండ్స్, వాళ్ల పెట్స్, తన పెట్స్‌ను అలా వాకింగ్‌కు తీసుకెళ్తూ నార్మల్ లైఫ్‌లోకి వచ్చేసింది. ఇక తాజాగా సమంత తన వర్కవుట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదే విషయాన్ని చెబుతూ సమంత తన ట్రైనర్‌కు సెటైర్లు వేసింది. ఎవరైనా ఇలా చేస్తారా? మీరు లేకపోయినా కూడా నేను వర్కవుట్లు చేసేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

samantha with hash and workouts
ముప్పై కిలోల డంబెల్‌తో సమంత వర్కవుట్లు చేస్తోంది. అందులోనూ అది తన సైజులో సగం ఉందంటూ కౌంటర్లు వేసింది. మొత్తానికి సమంత మాత్రం మళ్లీ తన రొటీన్ లైఫ్‌ను ప్రారంభించేసింది. దసరా సందర్భంగా రెండు ప్రాజెక్ట్‌లను సమంత ప్రకటించింది. అవి రెండు కూడా ద్విభాష చిత్రాలే. తమిళ, తెలుగు భాషల్లో ఈ రెండు సినిమాలు రాబోతోన్నాయి. అలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ప్రారంభించడంతో సమంత స్పీడు చూసి అంతా షాక్ అవుతున్నారు.