Rashmika Mandanna : నాకు ఆ పని చేయడం ఇష్టం.. రష్మిక మందన్న
Rashmika Mandanna : రష్మిక మందన ప్రస్తుతం తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. నేషనల్ క్రష్ అంటూ రష్మిక అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ అయిపోయింది. పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. ఇక బాలీవుడ్‌లో ఆల్రెడీ రష్మిక రెండు మూడు సినిమాలు కమిట్ అయింది. మొత్తానికి రష్మిక మాత్రం రాను రాను తెలుగులో కనిపించకపోవచ్చు కూడా.రష్మిక చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలేవీ లేవు.
పుష్ప పార్ట్ 2 మాత్రమే రష్మిక చేతిలో ఉంది.ఇక దళపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతోన్న ద్విభాష చిత్రంలోనూ రష్మిక ఎంపికైంది. మామూలుగా అయితే అందులో పూజా హెగ్డేను తీసుకుందామని అనుకున్నారట. కానీ డేట్స్ క్లాష్ అవుతుండటంతో అందులో రష్మికను తీసేసుకున్నారు. మొత్తానికి రష్మికకు మాత్రం బంపర్ ఆఫర్ వచ్చేసింది.రష్మిక మందన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన అభిమానులు మాత్రం పట్టించుకుంటుంది. ఎప్పుడూ వారితో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది.

Rashmika Mandanna As Water Baby Swimming Pool
అయితే రష్మిక ఈ మధ్య ఎక్కువగా వర్కవుట్లు చేయడం లేదు. గత ఏడాది మాత్రం రష్మిక ఎక్కువగా వర్కవుట్లతోనే గడిపింది. ఇప్పుడు తన పెట్ ఆరా చుట్టే రష్మిక తిరుగుతోంది. ఇక తాజాగా రష్మిక స్విమ్మింగ్ పూల్ వీడియోను షేర్ చేసింది.తనకు స్విమ్మింగ్ చేయడం అంటే ఇష్టమట.. ఇలా స్నానం చేయడమే తనకు ఇష్టమని, తాను వాటర్ బేబీ అంటూ క్యూట్‌గా చెప్పిన యూట్యూబ్ షార్ట్స్ వీడియో వైరల్ అవుతోంది. వాటర్ బేబీలా కనిపించిన రష్మిక తడి అందాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.