Rashmika Mandanna faces lot of problems in starting stage
Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. పుష్ప, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఈ అమ్మడికి మంచి విజయాలని అందించాయి. దీంతో నేషనల్ క్రష్‌గా మారింది రష్మిక. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషలలోను ఈ అమ్మడు దూసుకుపోతుంది.తెలుగులో ఆమె `పుష్ప 2`లో నటిస్తుండగాచ హిందీలో `యానిమల్` సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలో `వారసుడు` చిత్రంలో విజయ్ సరసన నటిస్తుంది. దీంతో పాటు తమిళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలోను ఈ అమ్మడి రచ్చ మాములుగా ఉండదు.
గ్లామర్ డోస్ పెంచుతూ ఆమె పంచుకునే ఫోటోలు అటు సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టిస్తుంటాయి. అయితే రష్మిక ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో కష్ట నష్టాలు చూసి ఈ స్థాయికి వచ్చింది రష్మిక. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ పడ్డ ఇబ్బందులు గురించి చెప్పి అందరని ఆశ్చర్యపరచింది. రష్మిక చిన్నతనంలో పేరెంట్స్ కనీసం ఇంటి అద్దె కట్టలేక, ప్రతి రెండు నెలలకు ఇల్లు మారేవారట. కొన్ని సార్లు అయితే ఇంటి అద్దె చెల్లించలేదని యజమానులు ఇల్లు ఖాళీ చేయించి బయటకు పంపేవారని స్పష్టం చేసింది. ఆ సమయంలో అద్దె ఇల్లు వెతుక్కోవడం చాలా ఇబ్బందిగా మారేదని రష్మిక పేర్కొంది.
Rashmika Mandanna faces lot of problems in starting stage
అలానే తాను తన పేరెంట్స్ కి వారు కావలనుకున్నది కొని ఇవ్వాలని అనుకునేదట. అది కొనివ్వడానికి డబ్బులు ఉండేవి కావట. కనీసం ఒక బొమ్మ కొనిపెట్టే స్థోమత కూడా రష్మిక పేరెంట్స్ కి ఉండేది కాదని చెప్పుకొచ్చింది. నా చిన్న తనంలో చూసిన బాధల వలన ఇప్పుడు ప్రతి రూపాయిని నేను గౌరవిస్తాను. ఈ సక్సెస్, ఫేమ్ గ్రాంటెడ్ గా తీసుకోను. మా కుటుంబం అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు అవి ఇప్పటికీ నాకు ఉన్నాయి. చిన్నప్పుడు కేవలం నీడ కోసం మేము పడ్డ ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు అని రష్మిక పేర్కొంది. ఇప్పుడు రష్మిక ముంబైలో ఖరీదైన బిల్డింగ్‌తో పాటు చాలా ఆస్తులు కూడపెట్టింది.
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
This website uses cookies.