Rashmika Mandanna : కోట్లు సంపాదిస్తున్న రష్మిక మందన్న.. ఇంటి అద్దె క‌ట్ట‌లేక వీధుల్లో తిరిగిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : కోట్లు సంపాదిస్తున్న రష్మిక మందన్న.. ఇంటి అద్దె క‌ట్ట‌లేక వీధుల్లో తిరిగిందా?

 Authored By sandeep | The Telugu News | Updated on :16 November 2022,11:00 am

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. పుష్ప‌, స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాలు ఈ అమ్మ‌డికి మంచి విజ‌యాల‌ని అందించాయి. దీంతో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది ర‌ష్మిక‌. తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ భాష‌ల‌లోను ఈ అమ్మ‌డు దూసుకుపోతుంది.తెలుగులో ఆమె `పుష్ప 2`లో నటిస్తుండ‌గాచ హిందీలో `యానిమల్‌` సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలో `వారసుడు` చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న నటిస్తుంది. దీంతో పాటు తమిళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇక సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మడి ర‌చ్చ మాములుగా ఉండ‌దు.

గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఆమె పంచుకునే ఫోటోలు అటు సోషల్‌ మీడియాలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంటాయి. అయితే ర‌ష్మిక ఈ స్థాయికి చేరుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఎన్నో క‌ష్ట న‌ష్టాలు చూసి ఈ స్థాయికి వ‌చ్చింది ర‌ష్మిక‌. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ఫ్యామిలీ ప‌డ్డ ఇబ్బందులు గురించి చెప్పి అంద‌ర‌ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. రష్మిక చిన్నతనంలో పేరెంట్స్ కనీసం ఇంటి అద్దె కట్టలేక, ప్రతి రెండు నెలలకు ఇల్లు మారేవారట. కొన్ని సార్లు అయితే ఇంటి అద్దె చెల్లించలేదని యజమానులు ఇల్లు ఖాళీ చేయించి బయటకు పంపేవారని స్ప‌ష్టం చేసింది. ఆ స‌మ‌యంలో అద్దె ఇల్లు వెతుక్కోవడం చాలా ఇబ్బందిగా మారేద‌ని ర‌ష్మిక పేర్కొంది.

Rashmika Mandanna faces lot of problems in starting stage

Rashmika Mandanna faces lot of problems in starting stage

Rashmika Mandanna : రేంజ్ మారింది…!

అలానే తాను త‌న పేరెంట్స్ కి వారు కావ‌ల‌నుకున్న‌ది కొని ఇవ్వాల‌ని అనుకునేద‌ట‌. అది కొనివ్వడానికి డబ్బులు ఉండేవి కావట. కనీసం ఒక బొమ్మ కొనిపెట్టే స్థోమత కూడా రష్మిక పేరెంట్స్ కి ఉండేది కాదని చెప్పుకొచ్చింది. నా చిన్న త‌నంలో చూసిన బాధ‌ల వ‌ల‌న ఇప్పుడు ప్రతి రూపాయిని నేను గౌరవిస్తాను. ఈ సక్సెస్, ఫేమ్ గ్రాంటెడ్ గా తీసుకోను. మా కుటుంబం అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు అవి ఇప్ప‌టికీ నాకు ఉన్నాయి. చిన్నప్పుడు కేవలం నీడ కోసం మేము పడ్డ ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు అని ర‌ష్మిక పేర్కొంది. ఇప్పుడు ర‌ష్మిక ముంబైలో ఖ‌రీదైన బిల్డింగ్‌తో పాటు చాలా ఆస్తులు కూడ‌పెట్టింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది