Rashmika Mandanna : ఎవ్వరూ పనికిరారు ఈ జోష్ ముందు .. రష్మికా మందన్న ఏం చేసిందో చూడండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : ఎవ్వరూ పనికిరారు ఈ జోష్ ముందు .. రష్మికా మందన్న ఏం చేసిందో చూడండి !

Rashmika Mandanna : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది నేషనల్ క్రష్ రష్మికా మందన్న. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది. అయితే ఈ బ్యూటీ నటించిన మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. రెండు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో రష్మిక కెరీర్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఆమెకు బాలీవుడ్లో ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే త్వరలో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :30 April 2023,2:00 pm

Rashmika Mandanna : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది నేషనల్ క్రష్ రష్మికా మందన్న. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది. అయితే ఈ బ్యూటీ నటించిన మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. రెండు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో రష్మిక కెరీర్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఆమెకు బాలీవుడ్లో ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే త్వరలో మరాఠీ రాజ్య వ్యవస్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో ఆ మహావీరుడి కోడలిగా రష్మిక నటించబోతోంది.

Rashmika Mandanna latest movie update

Rashmika Mandanna latest movie update

శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ బోంస్లే జీవితం ఆధారంగా బాలీవుడ్ లో భారీ పిరియాడికల్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకి హీరోగా విక్కీ కౌశల్ నటించబోతున్నాడు. శంభాజీ భోంస్లే గా విక్కీ కౌశల్, ఆయన భార్యగా ఏసు బాయి భోంస్లే గా రష్మిక నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు ఛావా అనే సినిమా టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు మహారాణిగా ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసిందట.

Rashmika Mandanna Hotness Overload In Red Dress At HT Most Stylish Awards  2022 - YouTube

అప్పటి యాస భాషతో పాటు యుద్ధ విన్యాసాల ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందట ఇక హీరో విక్కీ కౌశల్ కూడా గత కొద్దిరోజులుగా గుర్రపు స్వారీ కత్తి యుద్ధం విలువిద్య నేర్చుకుంటున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మరి ఛత్రపతి శివాజీ కోడలిగా, మహారాణిగా రష్మిక ఎటువంటి పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం దేశమంతటా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి చిత్ర యూనిట్ ఎప్పుడు విడుదల చేస్తారు చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది