Rashmika Mandanna : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది నేషనల్ క్రష్ రష్మికా మందన్న. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది. అయితే ఈ బ్యూటీ నటించిన మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. రెండు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో రష్మిక కెరీర్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఆమెకు బాలీవుడ్లో ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే త్వరలో మరాఠీ రాజ్య వ్యవస్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో ఆ మహావీరుడి కోడలిగా రష్మిక నటించబోతోంది.
శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ బోంస్లే జీవితం ఆధారంగా బాలీవుడ్ లో భారీ పిరియాడికల్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకి హీరోగా విక్కీ కౌశల్ నటించబోతున్నాడు. శంభాజీ భోంస్లే గా విక్కీ కౌశల్, ఆయన భార్యగా ఏసు బాయి భోంస్లే గా రష్మిక నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు ఛావా అనే సినిమా టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు మహారాణిగా ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసిందట.
అప్పటి యాస భాషతో పాటు యుద్ధ విన్యాసాల ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందట ఇక హీరో విక్కీ కౌశల్ కూడా గత కొద్దిరోజులుగా గుర్రపు స్వారీ కత్తి యుద్ధం విలువిద్య నేర్చుకుంటున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మరి ఛత్రపతి శివాజీ కోడలిగా, మహారాణిగా రష్మిక ఎటువంటి పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం దేశమంతటా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి చిత్ర యూనిట్ ఎప్పుడు విడుదల చేస్తారు చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.