Rashmika Mandanna : రెచ్చిపోయిన రష్మిక మందన్నా.. ఏంటి ఇంత మార్పు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : రెచ్చిపోయిన రష్మిక మందన్నా.. ఏంటి ఇంత మార్పు..!

Rashmika Mandanna : ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే అందాల ముద్దుగుమ్మ‌లు ఇప్పుడు మాత్రం గ్లామ‌ర్ షోకి హ‌ద్దులు పెట్టుకోవ‌డం లేదు. రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తున్నారు. స‌మంత‌, ర‌ష్మిక ఇటీవలి కాలంలో తెగ రెచ్చిపోతున్నారు. కన్నడలో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ర‌ష్మిక విష‌యానికి వ‌స్తే.. ఇప్పుడు తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటుతోంది. ఇక ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో నేషనల్ క్రష్ గా మారి సందడి చేస్తోంది. ఇక […]

 Authored By sandeep | The Telugu News | Updated on :7 June 2022,6:30 pm

Rashmika Mandanna : ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే అందాల ముద్దుగుమ్మ‌లు ఇప్పుడు మాత్రం గ్లామ‌ర్ షోకి హ‌ద్దులు పెట్టుకోవ‌డం లేదు. రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తున్నారు. స‌మంత‌, ర‌ష్మిక ఇటీవలి కాలంలో తెగ రెచ్చిపోతున్నారు. కన్నడలో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ర‌ష్మిక విష‌యానికి వ‌స్తే.. ఇప్పుడు తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటుతోంది. ఇక ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో నేషనల్ క్రష్ గా మారి సందడి చేస్తోంది. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేసి రచ్చ చేస్తూ ఉంటుంది.

రష్మిక మందన్న ‘కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో తొలుత హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసింది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆమెకు అక్కడ అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఆమె ‘అంజనీ పుత్ర’, ‘చమ్మక్’ వంటి కన్నడ సినిమాలు చేసింది. అయితే కిర్రాక్ పార్టీ చూసిన దర్శకుడు వెంకీ కుడుముల ఆమెకు ఛలో సినిమాలో అవకాశం ఇచ్చారు. మొదటి సినిమానే హిట్ కావడంతో రష్మికకు తెలుగులో కూడా వరుస అవకాశాలు దక్కాయి. అందుకే ఆమెకు తెలుగులోనే రష్మిక మందన్నాకు మంచి పేరు వచ్చింది. ‘ఛలో’ తర్వాత ఆమె చేసిన ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ప’ వంటి భారీ హిట్ సినిమాలు అందుకుంది.

Rashmika Mandanna mesmarizing pics

Rashmika Mandanna mesmarizing pics

Rashmika Mandanna : వారెవ్వా.. ర‌ష్మిక‌

చివరిగా రష్మిక మందన్నా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా ఆమెకు కలిసి రాలేదు. అయితే పుష్ప ఇచ్చిన క్రేజ్ తో ఆమె ఇప్పటికీ రచ్చ చేస్తోంది. ఆమె తెలుగులో ‘పుష్ప 2’ అనే సినిమా చేస్తోంది. ఇక ‘మిష‌న్ మ‌జ్ను’ మూవీతో హిందీ ఎంట్రీ ఇస్తున్న ఆమె అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ అమ్మ‌డు వ‌రుస ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తుంది. తాజాగా ఫిలింఫేర్ కోసం అదిరిపోయే అందాలు చూపిస్తూ మెంట‌లెక్కించింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది