Rashmika Mandanna remuneration topic now
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నఈ భామ ఆ తర్వాత విజయ్‌తో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి సినిమాలు చేసింది. తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తూనే వస్తుంది. అయితే వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఈ శాండిల్ వుడ్ బ్యూటీ అందిపుచ్చుకుంటూ దూసుకెళుతుండగా, తాజాగా రష్మిక మందన్నకి సంబంధించిన ఓ అంశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రష్మిక మందన్న ప్రస్తుతం హీరోయిన్‌గా చేస్తూనే ఓ ఐటెం సాంగ్‌లో నటించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 చేస్లుండగా, ఈ సినిమాలో గ్లామర్ డోస్‌ను త్రివిక్రమ్ బాగానే పెంచాడు. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ అయిన పూజా హెగ్డే ,శ్రీలీల నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు ఇప్పుడు రష్మిక మందన్న ఐటెమ్ సాంగ్ చేస్తుందనే వార్త బయటకు రావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ముగ్గురు భామలు ఒక సినిమాలో నటిస్తున్నారు అనే సరికి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రష్మిక.. ఇంతకు ముందు మహేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేసిందని సమాచారం.
Rashmika Mandanna remuneration topic now
ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకోగా, రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తండ్రి ఇందిరాదేవి కన్నుమూయడంతో షూటింగ్ వాయిదా పడింది. డిసెంబర్ రెండో వారం నుంచి తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక ఇటీవల తెలుగులో సీతారామం అనే సినిమాతో పలకరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆమె నటించిన మరో సినిమా గుడ్ బై ఇటీవల విడుదలై ఓకే అనిపించుకోగా, ప్రస్తుతం హిందీలో మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల…
This website uses cookies.