Rashmika Mandanna : మహేష్ ఫ్యాన్సా మజాకా.. రష్మిక చేత సారీ చెప్పించేదాకా ట్రోల్ చేశారుగ.. ఇంతకీ ఏమైంది..?
ప్రధానాంశాలు:
Rashmika Mandanna : మహేష్ ఫ్యాన్సా మజాకా.. రష్మిక చేత సారీ చెప్పించేదాకా ట్రోల్ చేశారుగ.. ఇంతకీ ఏమైంది..?
Rashmika Mandanna : సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో Mahesh babu పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ అయ్యింది. స్టార్ హీరోయిన్ రష్మిక సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తాకిడికి ఫైనల్ గా సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ మహేష్ Mahesh Fans ఫ్యాన్స్ రష్మికని ట్రోల్ చేయడం వెనక రీజన్ ఏంటి అసలు ఏం జరిగింది అంటే. రీసెంట్ ఇంటర్వ్యూలో రష్మిక తన ఫేవరెట్ హీరో దళపతి విజయ్ అని.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని అన్నది. అంతేకాదు ఆయన చేసిన సినిమాల్లో గిల్లి ఇష్టమని అన్నాది. ఐతే గిల్లి సినిమా మహేష్ పోకిరి సినిమాకు రీమేక్ అని కూడా చెప్పింది. ఐతే తనకు గిల్లి చాలా ఇష్టమని చెప్పింది. ఇదిగో ఇక్కడే మహేష్ ఫ్యాన్స్ కి దొరికేసింది అమ్మడు. గిల్లి సినిమా పోకిరి రీమేక్ అన్నది. కానీ గిల్లి మహేష్ ఒక్కడు సినిమాకు రీమేక్ గా వచ్చింది. మహేష్ ఒక్కడు సినిమానే తమిళ్ లో గిల్లి చేశారు. సూపర్ స్టార్ మహేష్ పోకిరి సినిమాను అదే టైటిల్ తో తమిళ్ లో తెరకెక్కించారు.
Rashmika Mandanna ఈ తాకిడి భరించలేకపోయిన రష్మిక..
ఈ క్లారిటీ లేని రష్మిక గిల్లి అంటే పోకిరి అనేసింది. అంతే ఒక్కసారిగా మహేష్ ఫ్యాన్స్ అంతా ఆమెను ఎటాక్ చేశారు. ఈ తాకిడి భరించలేకపోయిన రష్మిక సారీ అవును బాబులు గిల్లి ఒక్కడు రీమేక్. పొరపాటున అలా చెప్పేశా.. సారీ అది కావాలని జరగలేదని అన్నది. అలా మొత్తానికి రష్మిక చేత సారీ చెప్పించే దాకా సూపర్ స్టార్ ఫ్యాన్స్ వదల్లేదు. రష్మిక కావాలని చెప్పకపోయినా ఆమె పొరపాటుని మహేష్ ఫ్యాన్స్ సర్దిద్దే ప్రయత్నంలో కాస్త ఎక్కువ అటెన్షన్ ఇచ్చారు.
ఫ్యాన్స్ ట్రోల్స్ కి షాకైన రష్మిక వెంటనే తన సోషల్ మీడియాలో సారీ చెప్పింది. పొరపాటున అలా అన్నానని చెప్పింది. మహేష్ ఫ్యాన్స్ ఎవరైనా సూపర్ స్టార్ గురించి కానీ ఆఉయన సినిమాల గురించి కానీ మాట్లాడితే వెంటనే స్పందిస్తారు. అంతేకాదు అవతల వారు తలొగ్గేలా చేస్తారు…