Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2025,8:07 pm

ప్రధానాంశాలు:

  •  Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా మాస్ యాక్షన్ హీరోగా విజయ్ యాక్టింగ్ అదరగొట్టాడని… సత్యదేవ్, విజయ్ మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ అంటున్నారు ఫ్యాన్స్.

Rashmika Mandanna 10 ర‌ష్మిక‌ విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna : ఎన్ని క‌ష్టాలు…

ఈ సినిమాకు మరో హైలెట్ బీజీఎమ్. కథకు తగినట్లు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇరగదీశాడని…ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ సాధించి అదరగొట్టింది.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంపై ర‌ష్మిక‌ సైతం స్పందించింది. మొదటి నుంచి ఈ సినిమా కోసం ఎగ్జైటెడ్ గా ఉన్న రష్మిక.. అభిమానులతో కలిసి సినిమా చూడాలని అనుకుందట. హైదరాబాద్ ఫేమస్ సింగిల్ స్క్రీన్ లో ఆమె ఈ సినిమాను చూడాలనుకుందట.

ముందుగా శ్రీరాములు థియేటర్ లో ఆమె ప్లాన్ చేసుకోగా.. సెక్యూరిటీ కారణాలతో ఆమె సినిమా చూసేందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదట. దీంతో మరో సింగిల్ స్క్రీన్ థియేటర్ భ్రమరాంబ లో ఈ సినిమాను చూసిందట. అయితే చిత్రాన్ని నేరుగా కాకుండా మారువేశంలో వెళ్లి చూశారట. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ బయటపెట్టారు. ఇప్పుడు విషయం తెలియడంతో విజయ్, రష్మిక ఫ్యాన్స్ సర్ ప్రైజ్ గా ఫీల్ అవుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది