Rashmika Mandanna : కాబోయే అత్తగారి కుటుంబంతో థియేటర్‌లో సందడి చేసిన రష్మిక.. హింట్ ఇచ్చినట్టేనా ?
ప్రధానాంశాలు:
Rashmika Mandanna : కాబోయే అత్తగారి కుటుంబంతో థియేటర్‌లో సందడి చేసిన రష్మిక.. హింట్ ఇచ్చినట్టేనా ?
Rashmika Mandanna : గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ- రష్మికల రిలేషన్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తుంది.. ఈ ఇద్దరూ చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారని, ఆ విషయాన్ని ఇన్నాళ్లు గోప్యంగా ఉంచారనే టాక్ నడుస్తుంది. ఈ జంట చాలాసార్లు కలిసి మీడియా కంట పడ్డారు. అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు ఒకే లొకేషన్ లో వేరు వేరుగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ మధ్య రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఇటీవల దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లో జరుపుకుంది రష్మిక.
Rashmika Mandanna హింట్ ఇచ్చినట్టేనా..
కట్ చేస్తే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో ప్రత్యక్షం అయింది.విజయ్ తల్లి మాధవి, విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి శ్రీవల్లీ సినిమాను చూసింది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా.. విజయ్ రౌడీ బ్రాండ్ టీ షర్ట్ తో రష్మిక కనిపించడంతో మొత్తానికి కాబోయే భర్త బ్రాండ్ కు కూడా ప్రమోషన్స్ చేస్తున్నావ్ అన్నమాట అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ జంట త్వరలోనే పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమో అని అంటున్నారు.
గీత గోవిందం నుంచే విజయ్ -రష్మిక ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఈ జంట తామిద్దరం కేవలం మంచి స్నేహితులమే అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి వెకేషన్స్ కు వెళ్లడం.. రెస్టారెంట్స్ కు వెళ్లడం కెమెరా కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా రష్మిక తన ప్రతి పండగను విజయ్ ఇంట్లోనే జరుపుకుంటుంది. దీంతో అభిమానులలో కూడా అనేక అనుమానాలు మొదలయ్యాయి. పుష్ప 2 సినిమాతో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ మంచి హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.