Rashmika Mandanna : వయనాడ్ కు భారీ విరాళం అందించిన రష్మిక.. రివర్స్ లో ఆమెను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 August 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Rashmika Mandanna : వయనాడ్ కు భారీ విరాళం అందించిన రష్మిక.. రివర్స్ లో ఆమెను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

Rashmika Mandanna : కేరళలో భారీ వర్షాల వల్ల అక్కడ ప్రకృతి వైపరిత్యాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోతుండగా.. వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆ పాత్రంలో జరుగుతున్న ఈ విళ తాండవానికి అక్కడ ప్రజలు నిరాశ్రయులయ్యారు. వయనాడ్ మొతం జల ప్రవాహంతో నిండిపోయింది. ఐతే ఇప్పటికే బాధితులను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టారు. వయనాడ్ ప్రకృతి బీభత్సానికి అక్కడి ప్రజలను ఆదుకోవడం కోసం దేశం అంతా కూడా తరలి వస్తుంది. ఇలాంటి విపత్తులు జరిగీనప్పుడు తమ వంతుగా కదిలి వచ్చే సినీ సెలబ్రిటీస్ కూడా బాధితుల కోసం భారీ విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ నుంచి సూర్య, జ్యోతిక, కార్తీలు కలిసి 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ 10 లక్షలు, ముమ్మట్టి 15 లక్షలు, కమల్‌ హాసన్‌ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.

Rashmika Mandanna ఆ నిర్మాతతో పాటు రష్మిక కూడా..

టాలీవుడ్‌ నుంచి యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ 5 లక్షల రూపాయల సాయం ప్రకటించగా అదే దారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా తన వంతుగా మయనాడ్ ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి 10 లక్షలు విరాళం ప్రకటించారు. మయనాడ్ విపత్తు జరిగిన ఈ టైం లో బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మొదటి హీరోయిన్ రష్మిక అని తెలుస్తుంది.

Rashmika Mandanna సాయం చేసినా నెటిజన్ల ట్రోలింగ్ ఎందుకు..

రష్మిక తన వంతుగా బాధితులకు సాయం చేస్తున్నా సరే అక్కడ కొడుగు గాట్ సెషన్ లో భూమి క్షీణత ఉంది. దానిపై స్పందించాలని ఆమెను చాలా సార్లు రష్మికని అభ్యర్ధించారు. ఐతే దాని గురించి అంతకుముందు మాట్లాడలేదు రష్మిక. ఇప్పుడు మయనాడ్ లో బాధితులను ఆదుకోవడం కోసం 10 లక్షలు సాయం అందిస్తుంటే సొంత ప్రాంత ప్రజలు అక్కర్లేదు కానీ వేరే వాళ్లకు సాయం చేస్తావా అని ట్రోల్ చేస్తున్నారు.

Rashmika Mandanna : వయనాడ్ కు భారీ విరాళం అందించిన రష్మిక.. రివర్స్ లో ఆమెను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

Rashmika Mandanna : వయనాడ్ కు భారీ విరాళం అందించిన రష్మిక.. రివర్స్ లో ఆమెను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

ఇక మయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాల దగ్గర ఇప్పటికే పునర్నిర్మాణాలు చేపట్టారు. కేరళ ప్రభుత్వ సహాయ నిధికి సామాన్యులు సైతం పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. రష్మిక కూడా 10 లక్షలు సాయం చేసి గొప్ప మనసు చాటుకుంది. కానీ కొందరు ఆమెను కావాలని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి