Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ సీజన్ 7 స్టార్టింగ్ ముందే చెప్పేశారు.. ఇది ఉల్టా పుల్టా అని. ఉల్టా పుల్టా అంటే ఏమో అనుకున్నాం కానీ… ఇది మామూలు ఉల్టా పుల్టా కాదు. రచ్చ రచ్చ చేసే ఉల్టా పుల్టా అని ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. బిగ్ బాస్ అప్పుడే ఆరు వారాలు పూర్తి చేసుకొని ఏడో వారంలోకి వచ్చేసింది. అంటే ఇంచుమించుగా సగం షో అయిపోయినట్టే. మొత్తం 15 వారాలే. అందులో ఆరు వారాలు అయిపోయాయి. ఇప్పటి వరకు ఆరుగురు బయటికి వెళ్లిపోయారు. అందరూ అమ్మాయిలే. ఒక్క అబ్బాయి కూడా ఇప్పటి వరకు బయటికి వెళ్లలేదు. కిరణ్ రాథోడ్ దగ్గర్నుంచి నిన్న ఎలిమినేట్ అయిన నయని పావని వరకు అందరూ లేడీ కంటెస్టెంట్సే. ఎలిమినేట్ అని చెప్పిన గౌతమ్ ఒక్కడే సీక్రెట్ రూమ్ కు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేశాడు.
అయితే.. హౌస్ లో మూడు వారాల పాటు ఉండి ఎలిమినేట్ అయిన శుభశ్రీ, రతిక, దామిని.. ఈ ముగ్గురిలో ఒక్కరికి మరో చాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ముగ్గురిని హౌస్ లోకి పంపించి ముగ్గురిలో ఎవరు హౌస్ లోకి రావాలని అనుకుంటే వాళ్లకు ఓటు చేయండి అని హౌస్ మెట్స్ కి చెబుతాడు నాగార్జున. దీంతో అందరూ ఆవేశపడి ఎవరు హౌస్ లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్లకు ఎక్కువ ఓట్లు వేస్తారు. కానీ.. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో ఆ ట్విస్ట్ ను నాగార్జున హౌస్ మెట్స్ కు రివీల్ చేశాడు. హౌస్ లోకి రావాలని ఎవరిని అయితే మీరు కోరుకుంటారో, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లు కాదు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేది.. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారు. ఇది ఉల్టా పుల్టా సీజన్ కదా.. బిగ్ బాస్ ఇలాగే డిసైడ్ చేశాడు అని చెబుతాడు నాగార్జున. దీంతో హౌస్ మెట్స్ అందరూ షాక్ అవుతారు.
అయితే.. అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చింది రతికా రోస్ కే. ఎక్కువ ఓట్లు వచ్చింది శుభశ్రీకి. నిజానికి శుభశ్రీ హౌస్ లోకి రావాలి. కానీ.. అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన రతికా రోస్ ను బిగ్ బాస్ మళ్లీ హౌస్ లోకి పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి.. రతిక హౌస్ లో ఉన్నప్పుడు చాలా గొడవలు జరిగాయి. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. పల్లవి ప్రశాంత్, శివాజీ విషయంలో రతిక చాలా నెగెటివ్ అయింది. అయితే.. ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత షో అంత రసవత్తరంగా లేదని.. మళ్లీ ఆమెను తీసుకురావాలని కూడా బిగ్ బాస్ అభిమానులు కోరుతున్నారు. చూద్దాం ఇప్పుడైనా రతిక తన సత్తా చాటుతుందో లేదో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.