Navya Swamy : రవికృష్ణ నవ్యస్వామి లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 25 January 2022, 12:30 pm

Navya Swamy : బుల్లితెరపై రవికృష్ణ నవ్యస్వామిల కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయ్యారు. ఆమె కథ సీరియల్‌తో మొదలైన వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. ఎక్కడికో వెళ్లిపోయింది. ఆఫ్ స్క్రీన్‌లో ఈ ఇద్దరూ చేసే హంగామా అంతా ఇంతా ఉండదు. ఇతర ఈవెంట్లలో ఈ ఇద్దరూ చేసే రొమాన్స్ మామూలుగా ఉండదు. గతంలో ఓ సారి సుమ క్యాష్ షోలో ఈ ఇద్దరూ వచ్చి హగ్గులు, ముద్దులతో దుమ్ములేపేశారు.

తాజాగా మరోసారి ఈ జోడి సుమ క్యాష్ షోలో వచ్చింది. అయితే అక్కడా మరోసారి తమ ట్రాక్‌ను వాడుకున్నారు. కావాలనే వారు వాడుకున్నారా? లేదంటే క్యాష్ టీం వాడుకుందో తెలియదు గానీ రవికృష్ణ నవ్యస్వామిలను మాత్రం మరోసారి రొమాంటిక్ యాంగిల్‌లోనే ప్రదర్శించారు. చివర్లో ఈ ఇద్దరితో ఓ స్కిట్ వేయించినట్టున్నారు. అయితే అది ప్రోమోలో నిజంగానే అనిపించేట్టు చూపించారు

Ravi Krishna And Navya Swamy Love Story in Suma Cash Show

Ravi Krishna And Navya Swamy Love Story in Suma Cash Show

Navya Swamy : క్యాష్ షోలో రవికృష్ణ నవ్యస్వామి

ఇక తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధానికి బీటలు వారినట్టుగా యాక్ట్ చేశారు. ఇంట్లోవాళ్లు ఒప్పుకోవడం లేదు.. వదిలేద్దామని నవ్యస్వామి ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో వాళ్లని అడిగి మనం ప్రేమించలేదు.. అంత ఈజీగా చెప్పేసి వెళ్లిపోతావేంటి? అని రవికృష్ణ ఓవర్ యాక్షన్.. నాక్కూడా అంత ఈజీగా లేదు.. కానీ వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా ప్రేమకు ఎండ్ కార్డ్ వేసేశారు. మొత్తానికి ఇది స్కిట్టా? నిజంగా ఏమైనా ఉందా? అన్నది తెలియాలంటే శనివారం వరకు ఆగాల్సిందే.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి