Eagl Movie Trailer : విధ్వంసం నేను .. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను రవితేజ ఈగల్ సినిమా ట్రైలర్ రిలీజ్..!
Eagl Movie Trailer : మాస్ మహారాజ రవితేజ Ravi Teja హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ధమాకా సినిమాతో కం బ్యాక్ ఇచ్చిన రవితేజ రావణాసుర సినిమాతో ఫ్లాప్ అయ్యారు. అయినను ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో యావరేజ్ హిట్ను అందుకున్న రవితేజ అతి కొద్ది గ్యాప్ లోనే Eagl Movie ‘ ఈగల్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా రవితేజ కొత్త లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈగల్ సినిమా ట్రైలర్ను ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేశారు.
Eagl Movie Trailer ఈగల్ మూవీ ట్రైలర్ రవితేజ మాస్ యాక్షన్ పవర్ఫుల్ ఎలివేషన్ డైలాగులతో ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా పవర్ ప్యాక్డ్ మూవీ లాగా ఉంది. తుపాకి నుంచి వచ్చే బుల్లెట్ ఆగేదెప్పుడో తెలుసా.. అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు..అంటూ అనుపమ పరమేశ్వరన్ తో నవదీప్ చెప్పే డైలాగ్ తో ఈగల్ ట్రైలర్ మొదలైంది. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఆపుతాను.. కాపలా అవుతాను..విధ్వంసం నేను విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని నేను.. అంటూ రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ ట్రైలర్లో ఆకట్టుకుంటుంది. రవితేజ, హీరోయిన్ కావ్య థాపర్ మధ్య లవ్ ట్రాక్ కూడా ట్రైలర్ లో కనిపిస్తుంది. రవితేజ యాక్షన్ డైలాగ్స్ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచాయి. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు .. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు .. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు.. అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది.
ఒక నిమిషం 56 సెకండ్ల పాటు ఉన్న ఈగల్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. రవితేజ అభిమానులు ఈ సినిమా చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమాలో పత్తి రైతు పాత్రగా రవితేజ కనిపించనున్నారు. మార్గశిరం మధ్య రాత్రి ఓ మొండి మోతుబరి చేసిన మారణ హోమం గురించి తెలియాలి అంటూ నవదీప్ డైలాగ్ కూడా ఉంది. మొత్తంగా సమాజంలో చీడపురుగులను రవితేజ ఏరైస్తాడు అనేలా ఉంది. ఇక ఈగల్ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. డావ్ జంద్ సంగీతం సమకూర్చారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
This website uses cookies.