Ravi Teja : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన కిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. రెండు సినిమాలు కూడా నిరాశ పరచడంతో రవితేజ మళ్ళి సందిగ్ధంలో పడినట్లు అయింది. ఆయన కెరియర్ కొన్ని సంవత్సరాల క్రితమే ముగిసినట్లే అనుకున్నారు. కానీ అనూహ్యంగా పుంజుకుని మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఏకంగా అరడజను సినిమాలకు రవితేజ సైన్ చేసిన విషయం తెలిసిందే. అందులో రెండు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా నిలిచాయి.
ఈ సమయంలో రవితేజ ధమాకా, టైగర్ నాగేశ్వరరావు మరియు రాక్షసుడు ఈ మూడు సినిమాల పై ఆధారపడి ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహారాజా రవితేజ హీరోగా ఈ మూడు సినిమాలు ఆడితే మరో ఐదు సంవత్సరాల పాటు దిగ్విజయంగా కెరీర్ లో ముందుకు వెళ్ల వచ్చు. మూడు సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం రవితేజ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అవ్వాల్సిందే అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికైతే రవితేజ కెరీర్ కి ఎలాంటి డోకా లేదు.
కానీ ఆ మూడు సినిమాల తర్వాత రవితేజ గురించి ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలను చూసుకోవాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రవితేజకు ఈ మూడు సినిమాలు ఎంత వరకు సక్సెస్ ని తెచ్చి పెడతాయి అనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.