Ravi Teja : రవితేజ కెరియర్ మొత్తం ఆ మూడు సినిమాల పైన ఆధారపడి ఉందంట | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ravi Teja : రవితేజ కెరియర్ మొత్తం ఆ మూడు సినిమాల పైన ఆధారపడి ఉందంట

 Authored By prabhas | The Telugu News | Updated on :11 August 2022,8:20 pm

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన కిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. రెండు సినిమాలు కూడా నిరాశ పరచడంతో రవితేజ మళ్ళి సందిగ్ధంలో పడినట్లు అయింది. ఆయన కెరియర్ కొన్ని సంవత్సరాల క్రితమే ముగిసినట్లే అనుకున్నారు. కానీ అనూహ్యంగా పుంజుకుని మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన క్రాక్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఏకంగా అరడజను సినిమాలకు రవితేజ సైన్ చేసిన విషయం తెలిసిందే. అందులో రెండు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా నిలిచాయి.

ఈ సమయంలో రవితేజ ధమాకా, టైగర్ నాగేశ్వరరావు మరియు రాక్షసుడు ఈ మూడు సినిమాల పై ఆధారపడి ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహారాజా రవితేజ హీరోగా ఈ మూడు సినిమాలు ఆడితే మరో ఐదు సంవత్సరాల పాటు దిగ్విజయంగా కెరీర్‌ లో ముందుకు వెళ్ల వచ్చు. మూడు సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం రవితేజ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అవ్వాల్సిందే అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికైతే రవితేజ కెరీర్ కి ఎలాంటి డోకా లేదు.

Ravi Teja entire career is said to be based on those three films

Ravi Teja entire career is said to be based on those three films

కానీ ఆ మూడు సినిమాల తర్వాత రవితేజ గురించి ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలను చూసుకోవాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రవితేజకు ఈ మూడు సినిమాలు ఎంత వరకు సక్సెస్ ని తెచ్చి పెడతాయి అనేది చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది