Acharya Movie : ఆచార్య ఎఫెక్ట్‌తో చిరంజీవి సినిమా నుండి ర‌వితేజ ఔట్

Authored By Sam C | The Telugu News | Published on: May 3, 2022, 5:30 pm

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో నిరాశ‌ప‌రిచింది. అయితే చిరు సినిమా మూడేళ్ల త‌ర్వాత వ‌చ్చినా ఆద‌ర‌ణ లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. అయితే ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల్లో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని మెగాస్టార్ కన్ఫర్మ్ చేసేశారు. ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి , బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుండి రవితేజ ను తప్పించినట్లు తెలుస్తోంది. చిరంజీవి , బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుండి రవితేజ తప్పించడానికి ప్రధాన కారణం… రవితేజ ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే అని ఒక టాక్ నడుస్తుంది. చిరంజీవి , బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం రవితేజ 16 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు , అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చుకోలేక మరో యంగ్ హీరో తో ముందుకు వెళ్దాము అనే ఆలోచనతో రవితేజ ఈ సినిమా నుండి తప్పించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ravi teja out from acharya Movie

ravi teja out from acharya Movie

Acharya Movie : విచిత్ర ప‌రిస్థితులు..

ఆచార్య ఎఫెక్ట్ వలన అంత బడ్జెట్ ను నిర్మాణ సంస్థ మోయలేమని చేతులు ఎత్తేసిందని, దీంతో రవితేజను తప్పించేసి ఆ ప్లేస్ లో యంగ్ హీరోను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ను లిమిటెడ్ గా వాడి నష్టాల వరకు వెళ్లకుండా చూసుకోవడానికి మైత్రీ మూవీ మేకర్స్ తగినన్ని చర్యలు తీసుకుంటున్నారట .ఇక నిర్మాతల మాటే తన మాట అని బాబీ కూడా సినిమాను తగిన బడ్జెస్ట్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇదంతా ఒక ఎట్టు అయితే ఇంకోపక్క రవితేజ షూటింగ్ లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడట. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Sam C

No bio available for this author.

  1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp