Chiranjeevi : భార్యతో విదేశాలకి వెళుతున్న చిరంజీవి.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు…!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న ఆచార్య. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. త్వరలో మరి కొన్ని సినిమాలతో పలకరించనున్నాడు. అయితే కొద్ది రోజులుగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి షూటింగ్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి సమ్మర్ ట్రిప్‌కు విదేశాలకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. ‘‘పాండమిక్ తర్వాత తొలి ఇంటర్నేషనల్ జర్నీ. చిన్న హాలీడే తీసుకుని సురేఖతో కలిసి చాలా రోజుల తర్వాత యు.ఎస్, యూరప్ వెళుతున్నాం.
త్వరలోనే అందరినీ కలుస్తాను’’ అంటూ చిరంజీవి మెసేజ్‌తో పాటు సురేఖతో ఫ్లైట్‌లో ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు.చిరంజీవి పోస్ట్‌పై ప్రముఖులు, కుటుంబ సభ్యులు ఆసక్తికరకామెంట్స్ చేస్తున్నారు. మెగా కోడలు ఉపాసన స్పందిస్తూ.. హ్యాపీ టైమ్ అత్తయ్య, మామయ్య అంటూ ఆమె కామెంట్ చేశారు. శ్రీజ కూడా తన పేరెంట్స్‌కి హ్యాపీ జర్నీ అని కామెంట్ పెట్టింది. ఇక చిరంజీవి ఫాలోవర్స్, ఫాన్స్, నెటిజన్స్ అందరూ హ్యాపీ జర్నీ అంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఇక ఆచార్య సినిమా విషయానికి వస్తే .. చిరంజీవి, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు నటించినప్పటికీ ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు.

chiranjeevi foreign tour with surekha
Chiranjeevi : చిరు ఫ్యామిలీ టూర్..
కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.ప్రస్తుతం చిరంజీవి లూసిఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. వీటి షూటింగ్స్ పూర్తి కాగానే వెంటనే దానయ్య నిర్మాతగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఇప్పటికే చిరంజీవి ఓకే చెప్పేశారు. దీంతో పాటు తన ఫ్రెండ్స్ రాధిక, శరత్ కుమార్ నిర్మాణ సంస్థ రాడాన్‌లో ఓసినిమా చేయబోతున్నారు చిరంజీవి. ఇలా వరుస సినిమాలతో రానున్న రోజులలో తెగ రచ్చ చేయబోతున్నాడు చిరు.