Esha Rebba: తెలుగ‌మ్మాయి చూడ ముచ్చ‌టైన అందంతో మ‌తి పోగొడుతుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: May 3, 2022, 4:30 pm

Esha Rebba : గ‌తంలో వేరే రాష్ట్రాల అమ్మాయిల‌కి మంచి డిమాండ్ ఉండేంది. ఇప్పుడు తెలుగ‌మ్మాయిలు కూడా పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. అలాంటి వారిలో ఈషా రెబ్బా ఒక‌రు. ఈ మధ్య కాలంలో తెలుగమ్మాయిలు వరుసగా ఆఫర్లను అందుకుంటూ త‌మ‌ అందం, అభినయంతో ఫిదా చేస్తుంది. భారీ ఆఫర్లను అందుకోకున్నా చిన్న చిత్రాలతో సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా యమ సందడి చేస్తోంది. హీరోయిన్ ఈషా రెబ్బా గ్లామర్ పరంగా స్టార్ హీరోయిన్లకు తీసిపోదు. పదేండ్ల నుంచి టాలీవుడ్ లోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్తోంది.

కానీ ఇప్పటి వరకు ఈషాకు సరైన గుర్తింపు దక్కలేదనే చెప్పాలి.శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అనంతరం ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆమె కెరీర్‌లో ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘ఆ!’, ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అయితే, ఆమె చేసిన సినిమాల్లో కేవలం రెండు మూడు మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. కానీ ఈషా రెబ్బాకు టాలీవుడ్ లో వర్కౌట్ కాలేదనే చెప్పాలి. మోడల్ గా తన కేరీర్ ప్రారంభించిన ఈషా ‘లైఫ్ ఈజ్ బ్యూటీ’ సినిమాతో వెండి తెరపై మెరిసింది.

esha rebba stunning looks viral

esha rebba stunning looks viral

Esha Rebba : శారీలో భ‌లేగుందిగా…!

గతేడాది నుంచి ఈ తెలుగు హీరోయిన్ తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అక్కడైనా తనకు మంచి సినిమాలు వస్తాయేమోనని ఆశిస్తోంది. ఈ మేరకు తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇక సినిమాల విషయం పక్కనెడితే.. సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరే ఉంటోందీ బ్యూటీ. లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లు మైమరిపిస్తోంది. తాజాగా ఈషా పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడు ట్రెండీ దుస్తుల‌లో ర‌చ్చ చేసే ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా చీర‌క‌ట్టులో క్యూట్ లుక్స్‌తో మ‌తులు పోగొడుతుంది. ఇందులో ఈషా స్ట‌న్నింగ్ లుక్స్ మెంట‌లెక్కిస్తున్నాయి.

Sam C

No bio available for this author.

  1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp