Unstoppable : నందమూరి నటసింహం బాలయ్య తెలుగు ఓటీటీ ‘ఆహా’లో అన్‌స్టాపెబుల్ షోతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నారు. వరుసగా సెలబ్రిటీలను తన షోలో ఇంటర్వ్యూ చేస్తున్నారు. తాజాగా ఈ షోకు మాస్ మహా రాజా రవితేజ, ‘క్రాక్’ ఫేమ్ డైరెక్టర్ గోపీ చంద్ మలినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని బాలయ్య తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా, సోషల్ మీడియాలో అది తెగ వైరలవుతోంది.‘ఆహా’ వారు విడుదల చేసిన సదరు ప్రోమోలో బాలయ్య చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ‘ఆహా’ వారు విడుదల చేసిన సదరు ప్రోమోలో బాలయ్య చాలా యాక్టివ్‌గా ఉన్నారు.
ఒకే ఫ్రేమ్‌లో రవితేజ, బాలయ్యను చూసి అభిమానులు ఆనందపడిపోతున్నారు. ఏడో ఎపిసోడ్‌లో భాగంగా వీరు ఈ షోకు హాజరు కాగా, చాలా సందడిగా ఈ ఎపిసోడ్ సాగిందని ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. ఇకపోతే ఎపిసోడ్‌లోకి రవితేజ ఎంటర్ కాగానే .. బాలయ్య మాట్లాడుతూ.. తనకు, రవితేజకు చాలా పెద్ద గొడవయిందన్న క్వశ్చన్‌కు ఆన్సర్ చెప్పాలని బాలయ్య అన్నారు. దాంతో రవితేజ స్పందించారు. పనీ పాట లేని డ్యాష్ గాళ్లకు అదే పని అని రిప్లయి ఇచ్చాడు మాస్ మహారాజా.ఈ క్రమంలోనే బాలయ్య రవితేజను కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగాడు. తన కొడుకు గురించి, యవ్వనంలో ఎవరికి లైన్ వేశావో చెప్పాలని టీజింగ్ చేసే క్వశ్చన్స్ అడిగారు బాలయ్య. వాటన్నటికీ వెరీ ఫన్నీ వేలో బాలయ్య సమాధానాలిచ్చారు.
ఇక రవితేజపై వచ్చిన డ్రగ్స్ కేసును గురించి కూడా బాలయ్య క్వశ్చన్ చేశారు. హెల్త్‌కు , ఫిట్ నెస్‌కు ప్రయారిటీ ఇచ్చే రవితేజ మీద డ్రగ్స్ కేసు ఎందుకు పెట్టారని బాలయ్య అడగగా, రవితేజ స్పందించారు. తనకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యం వేసిందని, అయితే, తనకు బాధ ఈ విషయం గురించి పెంట పెంట చేయడం వల్ల బాధ కలిగిందని రవితేజ తెలిపాడు. మొత్తంగా ప్రోమోలో రవితేజ, బాలయ్య మధ్య ఆసక్తికరంగా ముచ్చట్లు సాగాయని అర్థమువుతోంద.ఇకపోతే ఈ షోకు ‘క్రాక్’ ఫిల్మ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా వచ్చారు. ఈయన త్వరలో బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులోనూ శ్రుతిహాసనే హీరోయిన్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.