Ravi Teja : మాస్ మహరాజా రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదట్లో విలన్‌గా చేసిన అతను ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ఇటీవల రవితేజ చెప్పుకోదగ్గ సక్సెస్ లు అందుకోలేకపోతున్నాడు. ఒక్క హిట్ కొడితే రెండు మూడు ఫ్లాపులిస్తాడు.. రెమ్యునరేషన్ బాగా ఇస్తే కథ కూడా పట్టించుకోడు..! అని రవితేజపై అనేక రూమార్స్ వస్తున్నాయి. చివరగా 2010లో డాన్ శీను, 2011లో మిరపకాయ్‌తో వరసగా రెండు హిట్స్ ఇచ్చారు రవితేజ. దానికంటే ముందు దుబాయ్ శీను, కృష్ణ.. 2001-02 టైమ్‌లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్ లాంటి మంచి సినిమాలు చేశారు.
మూడేళ్ళ కింద క్రాక్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన రవితేజ.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతో మళ్లీ ట్రాక్ తప్పారు. రవితేజ పనైపోయిందనుకున్న తరుణంలో ధమాకాతో 100 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. రొటీన్ కంటెంట్‌తోనే వచ్చినా.. మాస్ రాజా ఇమేజ్ఆ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విజయంలో బ్యాక్ బోన్‌లా నిలిచారు రవితేజ. కానీ ఆ వెంటనే మళ్లీ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులిచ్చారు. ప్రయోగాలు తనకు కలిసి రావడం లేదని భావించిన రవితేజ మళ్లీ పాత కంటెంట్‌తోనే ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రీసెంట్‌గా ఈ చిత్రంలో జగపతిబాబు నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఆయన లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు. అయితే మిస్టర్ బచ్చన్ లో మాస్ మహారాజ ను ఏసెయ్యడానికి సిద్దం అని జగపతి బాబు సోషల్ మీడియా వేదిక గా పేర్కొన్నారు. దీనికి హీరో రవితేజ స్పందిస్తూ.. మిస్టర్ బచ్చన్ ఇక్కడ, ఎవరు ఎవర్ని ఏస్తారో చూస్కుందాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ కన్వర్జేషన్ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
This website uses cookies.