Ravi Teja : ఎవ‌రు ఎవ‌ర్ని వేస్తారో చూసుకుందాం అంటూ ఆ న‌టుడికి మాస్ వార్నింగ్ ఇచ్చిన ర‌వితేజ‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ravi Teja : ఎవ‌రు ఎవ‌ర్ని వేస్తారో చూసుకుందాం అంటూ ఆ న‌టుడికి మాస్ వార్నింగ్ ఇచ్చిన ర‌వితేజ‌..!

Ravi Teja : మాస్ మ‌హ‌రాజా రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు. మొదట్లో విల‌న్‌గా చేసిన అత‌ను ఆ త‌ర్వాత హీరోగా ఎదిగాడు. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ డిఫ‌రెంట్ పాత్ర‌ల‌తో ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రించాడు. ఇటీవ‌ల ర‌వితేజ చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ లు అందుకోలేక‌పోతున్నాడు. ఒక్క హిట్ కొడితే రెండు మూడు ఫ్లాపులిస్తాడు.. రెమ్యునరేషన్ బాగా ఇస్తే కథ కూడా పట్టించుకోడు..! అని ర‌వితేజపై అనేక రూమార్స్ వ‌స్తున్నాయి. చివరగా 2010లో డాన్ శీను, 2011లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Ravi Teja : ఎవ‌రు ఎవ‌ర్ని వేస్తారో చూసుకుందాం అంటూ ఆ న‌టుడికి మాస్ వార్నింగ్ ఇచ్చిన ర‌వితేజ‌..!

Ravi Teja : మాస్ మ‌హ‌రాజా రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు. మొదట్లో విల‌న్‌గా చేసిన అత‌ను ఆ త‌ర్వాత హీరోగా ఎదిగాడు. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ డిఫ‌రెంట్ పాత్ర‌ల‌తో ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రించాడు. ఇటీవ‌ల ర‌వితేజ చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ లు అందుకోలేక‌పోతున్నాడు. ఒక్క హిట్ కొడితే రెండు మూడు ఫ్లాపులిస్తాడు.. రెమ్యునరేషన్ బాగా ఇస్తే కథ కూడా పట్టించుకోడు..! అని ర‌వితేజపై అనేక రూమార్స్ వ‌స్తున్నాయి. చివరగా 2010లో డాన్ శీను, 2011లో మిరపకాయ్‌తో వరసగా రెండు హిట్స్ ఇచ్చారు రవితేజ. దానికంటే ముందు దుబాయ్ శీను, కృష్ణ.. 2001-02 టైమ్‌లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్ లాంటి మంచి సినిమాలు చేశారు.

Ravi Teja : మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఇక్క‌డ‌..

మూడేళ్ళ కింద క్రాక్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన రవితేజ.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతో మళ్లీ ట్రాక్ తప్పారు. ర‌వితేజ పనైపోయింద‌నుకున్న త‌రుణంలో ధమాకాతో 100 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. రొటీన్ కంటెంట్‌తోనే వచ్చినా.. మాస్ రాజా ఇమేజ్ఆ సినిమాకి బాగా ప్ల‌స్ అయింది. ఇక చిరంజీవి న‌టించిన వాల్తేరు వీరయ్య విజయంలో బ్యాక్ బోన్‌లా నిలిచారు రవితేజ. కానీ ఆ వెంటనే మళ్లీ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులిచ్చారు. ప్ర‌యోగాలు త‌నకు క‌లిసి రావ‌డం లేద‌ని భావించిన ర‌వితేజ మ‌ళ్లీ పాత కంటెంట్‌తోనే ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ అనే సినిమా చేస్తున్నాడు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Ravi Teja ఎవ‌రు ఎవ‌ర్ని వేస్తారో చూసుకుందాం అంటూ ఆ న‌టుడికి మాస్ వార్నింగ్ ఇచ్చిన ర‌వితేజ‌

Ravi Teja : ఎవ‌రు ఎవ‌ర్ని వేస్తారో చూసుకుందాం అంటూ ఆ న‌టుడికి మాస్ వార్నింగ్ ఇచ్చిన ర‌వితేజ‌..!

రీసెంట్‌గా ఈ చిత్రంలో జగపతిబాబు నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఆయన లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు. అయితే మిస్టర్ బచ్చన్ లో మాస్ మహారాజ ను ఏసెయ్యడానికి సిద్దం అని జగపతి బాబు సోషల్ మీడియా వేదిక గా పేర్కొన్నారు. దీనికి హీరో రవితేజ స్పందిస్తూ.. మిస్టర్ బచ్చన్ ఇక్కడ, ఎవరు ఎవర్ని ఏస్తారో చూస్కుందాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ కన్వర్జేషన్ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది