Raviteja : రవితేజ ఖిలాడి రిలీజ్ డేట్ తో డైలమాలో పడ్డ ఆచార్య.. నారప్ప ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raviteja : రవితేజ ఖిలాడి రిలీజ్ డేట్ తో డైలమాలో పడ్డ ఆచార్య.. నారప్ప ..?

 Authored By govind | The Telugu News | Updated on :31 January 2021,6:00 am

రవితేజ ఖిలాడి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌధరి – డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ సడన్ సర్‌ప్రైజ్ ఇస్తూ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇంతక ముందు రవితేజ – రమేష్ వర్మ కలిసి వీర అన్న సినిమా చేశారు. కాగా గత మూడేళ్ళుగా రవితేజ కి సక్సస్ లు రావడం లేదు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ మూడేళ్ళ కి క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి ఫాంలోకి వచ్చాడు. అంతేకాదు ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శక, నిర్మాతలకి .. హీరోలకి ధైర్యాన్నిచ్చింది. రవితేజ క్రాక్ తో కొట్టిన సక్సస్ దెబ్బకి వరసగా ఇప్పుడు టాలీవుడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలన్ని రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తున్నాయి.

raviteja khiladi release date is on may 28th now acharya and narappa are in dilemma

raviteja-khiladi-release-date-is-on-may-28th-now-acharya-and-narappa-are-in-dilemma

ఇప్పటికే మేయిన్ సినిమాల రిలీజ్ డేట్స్ అన్ని వచ్చేశాయి. పెండింగ్ ఏ సినిమాలైనా ఉన్నాయంటే పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ .. ప్రభాస్ – పూజా హెగ్డేల రాధే శ్యామ్ లాంటి రెండు పాన్ ఇండియన్ సినిమాలు.. అలాగే బోయపాటి శ్రీను -నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న బిబి3. త్వరలో ఈ సినిమాల రిలీజ్ డేట్ కూడా వచ్చేస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో మన మాస్ మహారాజ రవితేజ నటిస్తున ఖిలాడి సినిమా రిలీజ్ డేట్ కూడా తాజాగా ప్రకటించారు. మే 28 న రవితేజ ఖిలాడి సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

Raviteja : ఆచార్య.. నారప్ప రిలీజ్ డేట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా..?

అయితే రవితేజ ఖిలాడి సినిమా రిలీజ్ డేట్ మీద ఇప్పుడు అందరి కన్ను పడింది. ఇంత పక్కాగా రవితేజ ఎలా ప్లాన్ చేశాడని అంటున్నారు. అందుకు కారణం మే చివరి వారం వరకు టెంత్ అండ్ ఇంటర్ మీడియట్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చేసింది. అయితే మే 13 న ఆచార్య.. మే 14 న నారప్ప సినిమాలు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. ఎగ్జాంస్ టైం కాబట్టి ఆ ప్రభావం ఆచార్య.. నారప్ప మీద పడే అవకాశం ఉందని అంటున్నారు. కాని రవితేజ మాత్రం ఎగ్జాంస్ అన్ని ఎప్పుడు కంప్లీట్ అవుతున్నాయో చూసుకొని మే 28 న రిలీజ్ డేట్ లాక్ చేసి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది