Ravi Teja : లేడీ టైటిల్ తో వస్తున్న రవితేజ… హిట్టుకొట్టేనా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ravi Teja : లేడీ టైటిల్ తో వస్తున్న రవితేజ… హిట్టుకొట్టేనా…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 March 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Ravi Teja : లేడీ టైటిల్ తో వస్తున్న రవితేజ... హిట్టుకొట్టేనా...?

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ Ravi Teja ప్రస్తుతం “మాస్ జాతర” సినిమా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో బిజీ గా ఉన్నారు. శ్రీలీల Sreeleela కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భాను బొగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా..రీసెంట్ గా ఈమూవీ తాలూకా టీజర్ అభిమానులను అలరించింది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

Ravi Teja లేడీ టైటిల్ తో వస్తున్న రవితేజ హిట్టుకొట్టేనా

Ravi Teja : లేడీ టైటిల్ తో వస్తున్న రవితేజ… హిట్టుకొట్టేనా…?

ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ.దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పి కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి అనార్కలి Anarkali Movie అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కిషోర్ తిరుమల గతంలో “నేను శైలజ” (2016) ,”చిత్రలహరి” (2019) లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు రవితేజతో సినిమా చేయబోతుండడం అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సరికొత్త కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది