Raviteja : రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గత ఏడాది ‘రాక్షసుడు’ భారీ హిట్ అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రవితేజ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో రవితేజ కి జంటగా మీనాక్షి చౌధరి – డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో అర్జున్ విలన్ గా కనిపించబోతున్నాడు.
raviteja-khiladi-story-leak
రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రవితేజ డ్యూయల్ లుక్ తో పాటు ఖిలాడి పోస్టర్ అలాగే ఫస్ట్ గ్లింప్స్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచాయి. రీసెంట్ గా క్రాక్ సినిమాతో ఫాం లోకి వచ్చిన రవితేజ ఖిలాడి తో మరో భారీ అందుకోవడం ఖాయమని తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. అందుకు కారణం ఈ సినిమా కథ కాస్త లీకవడమే అంటున్నారు. కాగా ఖిలాడి సినిమాలో రవితేజ డ్యూల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారీ యాక్షన్ డ్రామాగా ఖిలాడి సినిమాని తెరకెక్కుస్తున్నారట. ఫస్ట్ గ్లింప్స్ లో అదే హింట్ ఇచ్చారని అంటున్నారు.
కాగా సినిమా టాకీపార్ట్ ని 55 నుంచి 60 రోజుల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారట. అయితే ఇందులో దాదాపు 40 రోజులు కేవలం యాక్షన్ సీన్స్ తెరకెక్కించడానికే కేటాయించినట్టు సమాచారం. దీన్ని బట్టి కథ ఎక్కువగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని అంటున్నారు. దీని గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చలు సాగుతున్నాయట. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ కంప్లీట్ గా తన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. త్రినాథ రావు నక్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రానుందని సమాచారం.
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
This website uses cookies.