Raviteja : రవితేజ ఖిలాడి స్టోరీ లీక్.. కథ లో ఇదే హైలెట్ ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raviteja : రవితేజ ఖిలాడి స్టోరీ లీక్.. కథ లో ఇదే హైలెట్ ..?

 Authored By govind | The Telugu News | Updated on :3 February 2021,3:15 pm

Raviteja : రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గత ఏడాది ‘రాక్షసుడు’ భారీ హిట్ అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రవితేజ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో రవితేజ కి జంటగా మీనాక్షి చౌధరి – డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో అర్జున్ విలన్ గా కనిపించబోతున్నాడు.

raviteja khiladi story leak

raviteja-khiladi-story-leak

రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రవితేజ డ్యూయల్ లుక్ తో పాటు ఖిలాడి పోస్టర్ అలాగే ఫస్ట్ గ్లింప్స్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచాయి. రీసెంట్ గా క్రాక్ సినిమాతో ఫాం లోకి వచ్చిన రవితేజ ఖిలాడి తో మరో భారీ అందుకోవడం ఖాయమని తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. అందుకు కారణం ఈ సినిమా కథ కాస్త లీకవడమే అంటున్నారు. కాగా ఖిలాడి సినిమాలో రవితేజ డ్యూల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారీ యాక్షన్ డ్రామాగా ఖిలాడి సినిమాని తెరకెక్కుస్తున్నారట. ఫస్ట్ గ్లింప్స్ లో అదే హింట్ ఇచ్చారని అంటున్నారు.

Raviteja : తన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ తో సినిమా చేయబోతున్న రవితేజ..?

కాగా సినిమా టాకీపార్ట్ ని 55 నుంచి 60 రోజుల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారట. అయితే ఇందులో దాదాపు 40 రోజులు కేవలం యాక్షన్ సీన్స్ తెరకెక్కించడానికే కేటాయించినట్టు సమాచారం. దీన్ని బట్టి కథ ఎక్కువగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని అంటున్నారు. దీని గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చలు సాగుతున్నాయట. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ కంప్లీట్ గా తన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. త్రినాథ రావు నక్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రానుందని సమాచారం.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది