
Jr Ntr : రామోజీరావుకి నివాళులు అర్పించిన అందరు హీరోలు.. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం..?
Jr Ntr : ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జూన్ 8 తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 87 ఏళ్ల వయసులో మృతి చెందిన ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు. వ్యాపార దిగ్గజంగా మంచి పేరు తెచ్చుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్, సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు. ఈయన జీవితం ఎంతో మంది యువ వ్యాపారవేత్తలకు మార్గదర్శకం. అయితే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతి వనంలో నిర్వహించింది.
రామోజీరావు కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామోజీరావుకి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు రామోజీరావు పాడెను మోశారు. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించగా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. దిగ్గజ వ్యక్తికి తుది నివాళులు అర్పించేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అంతిమ నివాళులు అర్పించటానికి రాకపోవటం ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది. రామోజీరావు నిర్మించిన సినిమా “నిన్ను చూడాలని” తో తారక్‌ను సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు రామోజీ రావు.
Jr Ntr : రామోజీరావుకి నివాళులు అర్పించిన అందరు హీరోలు.. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం..?
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఖచ్చితంగా రామోజీరావు కు తుది నివాళులు అర్పించటానికి వస్తారని అందరూ భావించారు. కానీ కొన్ని తప్పనిసరి పరిస్దితుల్లో కేవలం ఓ ట్వీట్ వేసి నివాళి అర్పించి ఊరుకోవాల్సి వచ్చింది ఎన్టీఆర్. గోవాలోని మారుమూల ప్రాంతంలో దేవర మూవీ షూటింగ్ జరుగుతుండడంతో రామోజీరావు అంత్యక్రియలకు ఆయనతో పాటు దేవర టీం కూడా హాజరుకాలేకపోయారు. తాజా షెడ్యూల్ జూన్ 3న ప్రారంభమైంది, ఎన్టీఆర్ జూన్ 5న షూట్‌లో జాయిన్ అయ్యాడు, అందుకే హైదరాబాద్‌కి రాలేకపోయాడు. గోవా షెడ్యూల్ చాలా ఖర్చుతో కూడుకుని ఉంది. తాను షూటింగ్ కాన్సిల్ చేసుకుని వస్తే చాలా మంది ఇబ్బంది పడతారు. డబ్బు కూడా వృదా అవుతుంది. దాంతో వేరే దారిలేక ఎన్టీఆర్ ఆగిపోయారని తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.