Shivam Dube : ఏదో పొడుస్తాడు అనుకుంటే వరల్డ్ కప్‌లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్న ధోని శిష్యుడు
Shivam Dube : ఈ ఏడాది ఐపీఎల్ ఫస్టాఫ్‌లో అద్భుతంగా ప్రదర్శన కనబరచడంతో శివమ్ దూబేని వరల్ట్ కప్ జట్టులోకి ఎంపిక చేయడం మనం చూశాం. అయితే ఎప్పుడైతే టీంలోకి ఎంపికయ్యాడో అప్పటి నుండి చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నప్పటి నుంచి శివమ్ దూబే శివాలెత్తిపోతున్నాడు. అతడి పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తీవ్రమైన పోటీ ఉన్నా కూడా.. భారత సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు. రింకూ సింగ్ లాంటి ఫినిషర్‌ను పక్కనపెట్టి మరీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు కల్పించారు.
మిడిల్ ఓవర్‌లలో పవర్ హిట్టింగ్ చేయగలడని భావించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ గతంలో మాదిరిగా వేగంగా ఆడలేకపోతున్నాడు. దీంతో జట్టును మరింత కష్టాల్లోకి నెడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన దూబే తీవ్రంగా నిరాశపరిచాడు. గత రాత్రి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌తో కూడా నిరాశపరిచాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మహ్మద్ రిజ్వాన్ క్యాచ్‌ను శివమ్ దూబే జారవిడిచాడు. బుమ్రా వేసిన లెంగ్త్ బంతికి రిజ్వాన్ క్రాస్ ఆడగా, బంతి డీప్ ఫైన్ లెగ్‌లోకి వెళ్లింది. దూబేకి క్యాచ్‌కి అవకాశం లభించినా, చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ని చేజేతులా జారవిడిచాడు. దీంతో దూబేపై ఓ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Shivam Dube : ఏదో పొడుస్తాడు అనుకుంటే వరల్డ్ కప్‌లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్న ధోని శిష్యుడు
ధోని ఆధ్యర్వంలో ట్రైనింగ్ తీసుకుని, ఆయన పేరును చెడుగొడుతున్నావంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన స్థానంలో రింకూని కాని లేదంటే అభిషేక్ శర్మని కాని తీసుకొని ఉంటే బాగుండేదని కొందరు చెప్పుకొస్తున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించిన తర్వాత అంటే.. మే 1 నుంచి ఐదు మ్యాచులు ఆడిన దూబే.. ఒక్క మ్యాచ్‌లో కూడా మంచి ప్రదర్శన చేయలేదు. అతను పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా పరుగులు రాబట్టలేక ఔటయ్యాడు.
Samantha : ఎన్నో సంవత్సరాలుగా హీరోయిన్‌గా కొనసాగుతూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా…
Renu Desai doesn't like it at all Renu Desai : తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితమైన నటి…
Pakistani Terror Camps : భారత సైన్యం పాక్ ఉగ్రవాదానికి గట్టి షాక్ ఇచ్చింది. పాక్ లోని మొత్తం 9…
Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భారత India సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44…
Today Gold Price : మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు Gold Rates భారీగా పెరిగాయి. 24…
Operation Sindoor : పాక్‌లోని ఉగ్రస్థావరాలపై INDian VS Pakistan భారతదేశం మెరుపు దాడులు చేసింది. ' ఆపరేషన్ సింధూర్…
Anganwadis : అంగన్‌వాడీ టీచర్లుకు తెలంగాణ Telangana Govr ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…
Double Bedroom Houses : గ్రేటర్‌లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లని లబ్ధి దారులకి అందజేయాలని…
This website uses cookies.