Nayanthara : ప్ర‌భుదేవాని న‌య‌న‌తార వ‌దిలేయ‌డానికి కార‌ణం ఇదా.. ఇన్నాళ్ల‌కి బ‌య‌ట‌కి వ‌చ్చిన నిజం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nayanthara : ప్ర‌భుదేవాని న‌య‌న‌తార వ‌దిలేయ‌డానికి కార‌ణం ఇదా.. ఇన్నాళ్ల‌కి బ‌య‌ట‌కి వ‌చ్చిన నిజం..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 August 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Nayanthara : ప్ర‌భుదేవాని న‌య‌న‌తార వ‌దిలేయ‌డానికి కార‌ణం ఇదా.. ఇన్నాళ్ల‌కి బ‌య‌ట‌కి వ‌చ్చిన నిజం..!

Nayanthara : ఇప్ప‌టికే సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తుంది న‌య‌న‌తార‌. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్‌ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. అయితే ప్ర‌భుదేవాతో ప్రేమ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశం అయంది. నయనతార కోసం ప్రభుదేవా తన భార్య రమలతకు విడాకులు ఇచ్చేశాడు. అప్పట్లో ఈ మ్యాట‌ర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Nayanthara : ప్ర‌భుదేవా కండీష‌న్స్ వ‌ల్లనే..

ఇక రేపో మాపో ప్రభుదేవా, నయనతార మూడు ముళ్ళ బంధంతో ఒకటి అవుతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రభుదేవా, నయనతార బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నకు కొన్ని కారణాలు ప్రధానంగా వినిపించాయి. శింబుకు దూరమైన నయనతార పెళ్ళైన హీరో ప్రభుదేవాకు దగ్గరైంది. కొరియోగ్రఫీ, డైరెక్షన్ లో కూడా రాణిస్తున్న ప్రభుదేవాను నయనతార ఇష్టపడింది. 2009లో వీరు రిలేషన్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అనంతరం ఇద్దరూ ఓపెన్ అయ్యారు. కలిసి సినిమా వేడుకలకు హాజరయ్యేవారు. విందులు, విహారాల్లో పాల్గొంటూ మీడియాకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

Nayanthara ప్ర‌భుదేవాని న‌య‌న‌తార వ‌దిలేయ‌డానికి కార‌ణం ఇదా ఇన్నాళ్ల‌కి బ‌య‌ట‌కి వ‌చ్చిన నిజం

Nayanthara : ప్ర‌భుదేవాని న‌య‌న‌తార వ‌దిలేయ‌డానికి కార‌ణం ఇదా.. ఇన్నాళ్ల‌కి బ‌య‌ట‌కి వ‌చ్చిన నిజం..!

ప్రభుదేవాకు నయనతార ఎందుకు దూరమైందనే విషయంలో ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి క్లారిటీ లేదు. ఎట్టకేలకు అందుకు కారణాలు బయటకు వచ్చాయి. నయనతారకు ప్రభుదేవా కొన్ని కఠిన ఆంక్షలు విధించాడట.అవి నచ్చని నయనతార విడిపోవాలని నిర్ణయం తీసుకుందట. నయనతారకు ప్రభుదేవా పెట్టిన కండిషన్లే కొంపముంచాయని కోలీవుడ్ లో బలంగా టాక్ న‌డిచింది. క్రిస్టియన్ గా ఉన్న నయనతార‌ను ప్ర‌భుదేవా త‌న మ‌తంలోకి మారాల‌ని కోరాడ‌ట‌. అందుకు న‌య‌న్ ఒప్పుకుంద‌ట‌. అలాగే పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేయాల‌ని.. హౌస్ వైఫ్ గా మారిపోవాల‌ని ప్ర‌భుదేవా కండీష‌న్ పెట్టాడ‌ట‌. అయితే అందుకు మాత్రం న‌య‌న‌తార ఒప్పుకోలేదు. మ్యారేజ్ త‌ర్వాత కూడా యాక్టింగ్ కొన‌సాగిస్తాన‌ని.. కావాలంటే గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటాన‌ని న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసిందట‌. పెళ్లికి ముందే ఆదిపత్యం చ‌లాయించ‌డం స్టార్ట్ చేశాడ‌ట‌. ప్ర‌భుదేవా తీరుకు విసుగు చెందిన న‌య‌న‌తార‌.. అత‌నితో బ్రేకప్ చెప్పింద‌నే ప్ర‌చారం నడుస్తుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది