
relation between meena and sudeep
Meena : మీనా.. ఒకప్పుడు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. దక్షిణాదిలో అగ్రహీరోలందరితో నటించి మెప్పించిన నటి. తెలుగులో వెంకటేశ్, నాగార్జున సహా తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ స్టార్లతో జోడీ కట్టింది. గత 40 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో సత్తా చాటుతూనే ఉంది మీనా. ఇటీవల తన భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో మీనా కొన్నాళ్లు డిప్రెషన్‌లో ఉండిపోయింది.ఇక ఇప్పుడిప్పుడే ఆ డిప్రెషన్ నుండి బయటపడ్డ మీనా పలు సినిమాలు,టీవీ షోలతో బిజీగా ఉంది.
1982 లో తొలిసారి గా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నవయుగం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 1990 లలో హీరోయిన్ గా ఎంటర్ అయిన మీనా 2009 వరకు ఆమె సినిమాలతో కాకుండా ఎన్నో కాంట్రవర్సీ లను ఎదుర్కొంది. మరి ముఖ్యంగా మీనా పెళ్లి విషయంలో చాలా మంది హీరోలతో ఆమె పేరును జోడించి వార్తలు వచ్చేవి. కన్నడ హీరో కిచ్చా సుదీప్ తో రహస్యంగా వివాహం చేసుకుంది అని వార్తలు రావడం తో ఒక్కసారి సౌత్ ఇండియాలో ని అన్ని పరిశ్రమలు ఉలిక్కి పడ్డాయి. సుదీప్ – మీనా రెండు సినిమాల్లో నటించగా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. సుదీప్ చెప్పిన విషయం ప్రకారం ” మీనాతో నా రహస్య వివాహానికి సంబందించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు.”
relation between meena and sudeep
అని చెప్పారు. అయినా కూడా పెళ్లి గురించి వస్తున్న వార్తలు తగ్గకపోవడంతో మీనా సైతం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.మీడియా ఎప్పుడు నా పెళ్లి విషయంలో బాగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఇది మూడో సారి నాకు మీడియా పెళ్లి చేయడం. అంటూ గట్టిగానే బదులిచ్చింది. సుదీప్ నేను మంచి స్నేహితులం మాత్రమే. మేము ఇద్దరం కలిసి కేవలం రెండు సినిమాల్లో మాత్రమే కలిసి నటించాం. నా పెళ్లికి నేను ఆహ్వానం పంపి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.” అని చెప్పుకొచ్చింది మీనా. గాసిప్స్ ఎక్కువ కావడంతో మీనాకు వాళ్ల ఇంట్లో ఒక మంచి సాఫ్ట్ వేర్ సంబంధం చూసి పెళ్లి చేశారు. వీరికి పిల్లలు కలిగారు. దురదృష్టవశాత్తూ ఇటీవలే మీనా భర్త మరణించాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.