Sridevi : శ్రీ‌దేవికి, కమెడియ‌న్ రాజ‌బాబుకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Authored By aruna | The Telugu News | Published on: August 4, 2022, 8:00 pm

Sridevi : సినీ ఇండ‌స్ట్రీలో ఎన్టీ రామారావు, కృష్ణ టైమ్ లో క‌మెడియ‌న్స్ చాలా త‌క్క‌వ‌గా ఉండేవారు.. కానీ.. ఉన్న‌వాళ్లు అద్బుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేవారు.. అలాగే కమెడియ‌న్లు కూడా అప్ప‌ట్లో హీరోలుగా చేసి ఆక‌ట్టుకునేవారు. ఇక ఆ రోజుల్లో క‌మెడియ‌న్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు రాజ‌బాబు. బ‌క్క‌ప‌లుచ‌ని శ‌రీరంతో క‌నిపిస్తూ రాజ‌బాబు అంద‌ర్నీ న‌వ్వించేవాడు. అప్ప‌ట్లోనే రాజ‌బాబు హీరోల‌కు స‌మానంగా రెమ్యున‌రేష‌న్ అందుకునేవాడ‌ట‌. ఇక‌ స్టార్ హీరోలు అంద‌రితోనూ న‌టించిన రాజ‌బాబు హీరోగా కూడా సినిమాలు చేశాడు.

Sridevi : స్టార్ హీరోయిన్ల‌తో…

రాజ‌బాబు విజ‌య నిర్మ‌ల‌, వాణిశ్రీ లాంటి హీరోయిన్ ల ప‌క్క‌న హీరోగా అద‌ర‌గొట్టాడు. అంతే కాకుండా అతిలోక సుంద‌రి శ్రీదేవితో కూడా రాజబాబు సినిమాలో నటించ‌డం గ‌మ‌న‌ర్హం. అయితే శ్రీ‌దేవి అప్పుడ‌ప్పుడే హీరోయిన్ గా అవ‌కాశాలు అందుకుంటున్న స‌మ‌యంలో న‌టించింది. 1975 లో కృష్ణ – మంజుల హీరో, హీరోయిన్ లుగా న‌టించిన‌ దేవుడులాంటి మ‌నుషులు సినిమాలో రాజ‌బాబుకు జోడీగా శ్రీదేవి న‌టించింది. ఈ సినిమాలో రాజ‌బాబు శ్రీదేవి మ‌ధ్య ఓ సాంగ్ కూడా ఉంటుంది. మ‌రో విశేషం ఏంటంటే శ్రీదేవి కెరీర్ లో ఇదే మొద‌టి డ్యూయోట్. Relationship between Sridevi and comedian Rajababu..

Relationship between Sridevi and comedian Rajababu..అలా లెజెండ‌రీ క‌మెడియ‌న్ రాజ‌బాబుతో మొద‌టి డ్యూయెట్ చేసే అదృష్టాన్ని శ్రీదేవి ద‌క్కించుకుంటే.. అతిలోక సుంద‌రితో డ్యూయెట్ చేసే అదృష్టం క‌మెడియ‌న్ రాజ‌బాబుకు ద‌క్కింది.ఆ త‌ర్వాత శ్రీ‌దేవికి వ‌రుస హిట్లు రావ‌డంతో త‌న కెరీర్ లో స్టార్ హీరోల‌కు సైతం డేట్లు ఇవ్వ‌లేనంత‌గా బిజీ అయిపోయింది. స్టార్ హీరోల‌కు స‌మానంగా రెమ్యున‌రేషన్లు అందుకోవ‌డ‌మే కాకుండా… ఎంతటి హీరో అయినా తాను న‌టించాలంటే కండిష‌న్స్ పెట్టే స్థాయికి ఎదిగింది. ఇక ప్రేక్షుల‌కు వినోదాన్ని పంచిన రాజ‌బాబు.. శ్రీదేవి ఇద్ద‌రూ ఈ లోకంలో లేక‌పోవ‌డం దుర‌దృష్టం.

aruna

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp