Chiranjeevi : రేణూ దేశాయ్ మొహం కూడా చూడలేదుగా.. చిరంజీవి ఉద్దేశ్యం ఏంటి?
Chiranjeevi : చిరంజీవి రేణూ దేశాయ్ ఒకే ఈవెంట్‌లో కలిశారు. మామూలుగా అయితే మెగా ఫ్యామిలీతో రేణూ దేశాయ్ దూరంగా ఉంటోంది. పండుగల సందర్భంలో అప్పుడప్పుడు తన పిల్లలో మెగా ఇంటికి పంపిస్తుంటుంది. నిహారిక పెళ్లిలోనూ అకిరా, ఆద్యలు తెగ సందడి చేశారు. అయితే రేణూ దేశాయ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలా రేణూ దేశాయ్ మెగా ఫ్యామిలీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది.అలాంటి రేణూ దేశాయ్ మాత్రం చిరంజీవికి ఎదురుపడాల్సి వచ్చింది.
రవితేజ హీరోగా రాబోతోన్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ చిత్రంలో రేణూ దేశాయ్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. దీంతో ఈ ఈవెంట్‌కు రేణూ దేశాయ్ కూడా రావాల్సి వచ్చింది. అయితే ఈ ఈవెంట్‌లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.చిరంజీవి ఈ ఈవెంట్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే అందరినీ నవ్వుతూ పలకరించాడు. రేణూ దేశాయ్ పక్కన ఉన్న మహిళతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడినట్టు కనిపిస్తోంది.

Renu Desai And Chiranjeevi Video At Raviteja Tiger nageswara Rao Event
కానీ రేణూ దేశాయ్‌ని మాత్రం కన్నెత్తి కూడా చూడనట్టు కనిపిస్తోంది. రేణూ దేశాయ్ మాత్రం చిరంజీవిని నవ్వుతూనే పలకరించినట్టు తెలుస్తోంది.చిరంజీవి మాత్రం రేణూ దేశాయ్‌ను పట్టించుకోనట్టు కనిపిస్తోంది. లేదంటే ఆ హడావిడిలో మాట్లాడటం కుదర్లేదేమో గానీ మొత్తానికి ఈ ఘటన మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ కలిసి ఉన్న వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.
https://t.co/fO05qrVwdV#Chiranjeevi and #RenuDesai Visuals At #TigerNageswaraRao Movie Launch | #RaviTeja | #MegaStarChiranjeevi #Tollywood
— Filmylooks (@filmylooks) April 2, 2022