Renu Desai : ఇలా మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు.. కాశీలో రేణూ దేశాయ్
రేణూ దేశాయ్‌కు భక్తి, ప్రయాణాలు, కవిత్వం, చదవడం, నటించడం, దర్శకత్వం ఇలా అన్ని ఇష్టమే. ఒక్కో సందర్భంగా రేణూ దేశాయ్ తనలోని ఒక్కో ఇష్టాన్ని బయపెడుతుంది. రేణూ దేశాయ్ ఎక్కడికైనా వెకేషన్స్‌కు వెళ్తే.. ఫోటోగ్రఫీ టాలెంట్‌ను బయపెడుతుంది. రేణూ దేశాయ్ పరిమిత వనరులతోనే ఎంతో క్వాలిటీ ఫోటోలను తీస్తుంది. రేణూ దేశాయ్‌లో ఉన్న ఈ క్వాలిటీయే ఆద్య, అకీరాలకు వచ్చినట్టుంది.

Renu Desai As Piligrim In Kashi
వారు కూడా ఎక్కడికైనా వెళ్తే ముందు కెమెరాను పట్టుకుంటారు. ప్రకృతిలోని అందాలను కెమెరాలో బంధిస్తుంటారు. అలా ఇప్పుడు రేణూదేశాయ్ కాశీ యాత్రకు బయల్దేరింది. కారణం మాత్రం చెప్పలేదు కానీ కాశీ విశేషాలను మాత్రం చూపిస్తోంది. కాశీ ఘాట్, పవిత్రగంగ, అక్కడి దర్శనీయ ప్రదేశాలను కెమెరాలో బంధించి తన అభిమానులకు చూపిస్తోంది. అంతే కాకుండా పూర్తి భక్తిపారవశ్యంలో మునిగిన రేణూ దేశాయ్ ఫోటో కూడా బయటకు వచ్చింది.
భక్తి భావం ఎక్కువే : రేణూ దేశాయ్
తనకు భక్తి భావం ఎక్కువే అని రేణూ దేశాయ్ చెప్పకనే చెప్పేసింది. మొహం నిండా పసుపు, బొట్టుతో దర్శనమిచ్చింది. శివుడిలా అడ్డనామాలు పెట్టేసుకుంది. ప్రస్తుతం రేణూ దేశాయ్ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అయితే రేణూ దేశాయ్ తన సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్లిందా? లేదా కాస్త గ్యాప్ తీసుకుని అలా ప్రశాంతత కోసం వెళ్లిందా? అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు.