
Renu Desai : రేణూ దేశాయ్‌కి ఎక్కువైన వేధింపులు.. సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ మాజీ భార్య..!
Renu Desai : ఇటీవల రేణూ దేశాయ్ ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆమె టార్గెట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంత మంది ఎప్పుడూ రేణూ దేశాయ్‌ని తక్కువ చేసినట్టుగా కామెంట్లు పెడుతుంటారు. పవన్ కళ్యాణ్‌ను వదిలేసి తప్పు చేశావ్ అంటూ.. మళ్లీ ఆయన దగ్గరికే వెళ్లొచ్చు కదా? అంటూ ఇలా ఉచిత సలహాలు ఇస్తుంటారు. గత వారం రోజులుగా ఇలాంటి సలహాలు వస్తూనే ఉన్నాయి. వాటిపై రేణూ దేశాయ్ తన అభిప్రాయాన్ని చెబుతూనే వస్తున్నారు. తానేమీ విడాకులు అడగలేదని, తానేమీ విడిపోవాలని కోరుకోలేదంటూ.. ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారంటూ ఇలా నెటిజన్ల కామెంట్లకు రిప్లైలు ఇస్తూనే వస్తున్నారు.
అకీరా, ఆద్య మా అన్నయ్య పిల్లలు. అకీరాని దాచకండి. మాకు చూపించండని రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్స్ క్రింద తరచుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుంటారు. పెంచి పెద్ద చేసిన తల్లిగా వారి కామెంట్స్ ని రేణు దేశాయ్ సహించేవారు కాదు. చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యేవారు. గే పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవాలతో అకీరా, ఆద్య ఫోటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోని షేర్, ఎడిట్ చేస్తూ రేణు దేశాయ్ టార్గెట్ గా దారుణమైన ట్రోల్స్ చేశారు. ఆద్య కూడా మానసిక వేదనకు గురైందని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ ఆక్రోశం వ్యక్తం చేసింది.
Renu Desai : రేణూ దేశాయ్‌కి ఎక్కువైన వేధింపులు.. సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ మాజీ భార్య..!
వరుస సంఘటనల నేపథ్యంలో రేణు దేశాయ్ మానసికంగా చాలా కుంగిపోతుంది. ఈ క్రమంలో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ ను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ కి దూరం అవుతున్నట్లు తెలియజేశారు. సోషల్ మీడియా వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం అన్నారు. ఇన్‌స్టాని మాత్రం డిలీట్ చేయలేదు. ఇంస్టాగ్రామ్ ద్వారా నేను సామాజిక సేవ చేస్తున్నాను. కాబట్టి ఆ అకౌంట్ డిలీట్ చేయలేనని ఆమె వెల్లడించారు. ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ ని శాశ్వతంగా డిలీట్ చేస్తున్నట్లు తెలియజేశారు. రేణు దేశాయ్ నిర్ణయం ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. ఒకింత వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన రేణూ దేశాయ్‌ని వేధించకుండా ఉంటారా అనేది చూడాలి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.