Renu Desai : రేణూ దేశాయ్‌కి ఎక్కువైన వేధింపులు.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప‌వ‌న్ మాజీ భార్య..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Renu Desai : రేణూ దేశాయ్‌కి ఎక్కువైన వేధింపులు.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప‌వ‌న్ మాజీ భార్య..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Renu Desai : రేణూ దేశాయ్‌కి ఎక్కువైన వేధింపులు.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప‌వ‌న్ మాజీ భార్య..!

Renu Desai : ఇటీవ‌ల రేణూ దేశాయ్ ఎక్కువ‌గా హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కి ఆమె టార్గెట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంత మంది ఎప్పుడూ రేణూ దేశాయ్‌ని తక్కువ చేసినట్టుగా కామెంట్లు పెడుతుంటారు. పవన్ కళ్యాణ్‌ను వదిలేసి తప్పు చేశావ్ అంటూ.. మళ్లీ ఆయన దగ్గరికే వెళ్లొచ్చు కదా? అంటూ ఇలా ఉచిత సలహాలు ఇస్తుంటారు. గత వారం రోజులుగా ఇలాంటి సలహాలు వస్తూనే ఉన్నాయి. వాటిపై రేణూ దేశాయ్ తన అభిప్రాయాన్ని చెబుతూనే వస్తున్నారు. తానేమీ విడాకులు అడగలేదని, తానేమీ విడిపోవాలని కోరుకోలేదంటూ.. ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారంటూ ఇలా నెటిజన్ల కామెంట్లకు రిప్లైలు ఇస్తూనే వస్తున్నారు.

Renu Desai సంచ‌ల‌న నిర్ణ‌యం..

అకీరా, ఆద్య మా అన్నయ్య పిల్లలు. అకీరాని దాచకండి. మాకు చూపించండని రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్స్ క్రింద తరచుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుంటారు. పెంచి పెద్ద చేసిన తల్లిగా వారి కామెంట్స్ ని రేణు దేశాయ్ సహించేవారు కాదు. చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యేవారు. గే పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవాలతో అకీరా, ఆద్య ఫోటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోని షేర్, ఎడిట్ చేస్తూ రేణు దేశాయ్ టార్గెట్ గా దారుణమైన ట్రోల్స్ చేశారు. ఆద్య కూడా మానసిక వేదనకు గురైందని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ ఆక్రోశం వ్యక్తం చేసింది.

Renu Desai రేణూ దేశాయ్‌కి ఎక్కువైన వేధింపులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప‌వ‌న్ మాజీ భార్య

Renu Desai : రేణూ దేశాయ్‌కి ఎక్కువైన వేధింపులు.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప‌వ‌న్ మాజీ భార్య..!

వరుస సంఘటనల నేపథ్యంలో రేణు దేశాయ్ మానసికంగా చాలా కుంగిపోతుంది. ఈ క్రమంలో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ ను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ కి దూరం అవుతున్నట్లు తెలియజేశారు. సోషల్ మీడియా వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం అన్నారు. ఇన్‌స్టాని మాత్రం డిలీట్ చేయ‌లేదు. ఇంస్టాగ్రామ్ ద్వారా నేను సామాజిక సేవ చేస్తున్నాను. కాబట్టి ఆ అకౌంట్ డిలీట్ చేయలేనని ఆమె వెల్లడించారు. ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ ని శాశ్వతంగా డిలీట్ చేస్తున్నట్లు తెలియజేశారు. రేణు దేశాయ్ నిర్ణయం ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. ఒకింత వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైన రేణూ దేశాయ్‌ని వేధించ‌కుండా ఉంటారా అనేది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది