
Renu Desai : ఇన్నాళ్లకి విడాకులపై క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్.. అసలు విషయం బయటపెట్టడంతో..
Renu Desai : ఒకప్పుడు హీరోయిన్‌గా సత్తా చాటిన రేణూ దేశాయ్ ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆ మధ్య రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక పాత్ర పోషించి మెప్పించింది. ఇక ఆ తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో కొంత మంది చేసే కామెంట్లు చాలా వింతగా ఉంటాయి. పదే పదే రేణూ దేశాయ్‌ని వేధించేలానే ఆ కామెంట్లు కనిపిస్తుంటాయి.
రీసెంట్‌గా రేణూ దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ, హోమం గురించి చెప్పింది. తానే తన చేతుల్తో ప్రసాదం చేశానని, ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేత్తో ప్రసాదం చేయడం అంటే ఎంతో ఇష్టమని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇలా తన గురించి ఏదో చెబుతూ వేసిన పోస్ట్ మీద కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసందర్భం, అనవసరమైన కామెంట్లు చేస్తూ వచ్చారు. ఓ నెటిజన్ రేణూ దేశాయ్ గురించి మాట్లాడుతూ.. వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది.. ఒక దేవుడ్ని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు.. కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది.. ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది.. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన.. మేం మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన అని ఓ ఫ్యాన్ కామెంట్ పెట్టారు.
Renu Desai : ఇన్నాళ్లకి విడాకులపై క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్.. అసలు విషయం బయటపెట్టడంతో..
దానికి రేణూ దేశాయ్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మీకు కొంచెమైనా బుద్ది ఉంటే ఇలా అనేవారు కాదు.. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు.. నేను కాదు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి.. అని దండం పెట్టేశారు. సూపర్ అమ్మ మీరు.. అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారు అని ఇంకో మహానుభావుడు కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కు రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా? అంటే అర్థం ఏంటి?.. నాకు నా సొంత లైఫ్ ఉండదా?.. మీరు ఇలాంటి కామెంట్లు పెట్టి నన్ను బాదపెడుతున్నారు అని రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కొద్ది రోజులుగా రేణూ పిల్లలు అకీరా, ఆద్య పవన్ కళ్యాణ్‌తోనే ఉన్న విషయం తెలిసిందే.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.