
Alcohol : ఆల్కహాల్ అధికంగా తాగటం వలన ఎలాంటి వ్యాధులు సంభవిస్తాయో తెలుసా...!
Alcohol : ప్రస్తుతం ఈ రోజులలో పార్టీలు చేయడం,ఆ పార్టీలో మద్యం త్రాగే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అంతేకాక పెగ్గులు అధికంగా తీసుకోవటం ఒక అలవాటుగా మారింది. కొందరు సరదా కోసం ఆల్కహాల్ తీసుకుంటే, మరి కొందరు మాత్రంతమ బాధను మర్చిపోవడానికి తాగుతూ ఉంటారు. కానీ ఈ ఆల్కహాల్ అనేది శరీరానికి స్లో పాయిజన్ లాంటిది. ఇది ఎన్నో రకాల సమస్యలను కలిగిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగటం వలన కాలేయం మరియు గుండెపై కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. అంతేకాక ఆల్కహాల్ అధిక వినియోగం వలన ఎన్నో రకాల వ్యాధుల ప్రమాదాలను పెంచుతుంది. అందుకే ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. మద్యం సేవించడం వలన ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
లివర్ డ్యామేజ్ : ఆల్కహాల్ అనేది డైరెక్ట్ గా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ప్రతి నిత్యం ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నట్లయితే,అప్పుడు అది తన కాలేయం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరం ఆల్కహాల్ ను టాక్సి న్ గా తీసుకుంటుంది. ఇది కాలేయానికి సంబంధించిన కణాలను కూడా నాశనం చేస్తుంది. సిరోసిస్ లాంటి ఎంతో తీవ్రమైన వ్యాధులను కూడా కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ కు కూడా కారణం అవుతుంది. అంతేకాక ఆల్కహాల్ ఎక్కువగా తాగటం వలన ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది : ఇది నిజం. ఎక్కువ ఆల్కహాల్ తాగటం వలన శరీరంలో రక్తం గడ్డ కట్టడం లాంటివి కూడా సంభవిస్తాయి. ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి ఎక్కువ ఆల్కహాల్ తాగితే ఆ వ్యక్తి గుండెకు రక్తాన్ని పంప్ చేయటంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఇది గుండె సమస్యల ప్రమాదాలను కూడా ఎంతగానో పెంచుతుంది. ఎన్నో సందర్భాలలో గుండెపోటు సమస్యలకు కూడా దారి తీస్తుంది అని ఆరోగ్య నిపుణులు తెలిపారు..
నాడీ వ్యవస్థ ను ప్రభావితం చేస్తుంది : ఎక్కువ మొత్తం ఆల్కహాల్ ను తాగటం వల్ల అది నాడీ వ్యవస్థ పై కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మెదడుకు సంబంధించిన సమస్యలకు కూడా కారణం కావచ్చు. మాట్లాడే,ఆలోచించే, గుర్తుంచుకోవటంలో, శరీరంలో ప్రకంపనలు అనేవి వస్తాయి. సమతుల్యత అనేది ఎంతగానో క్షిణిస్తుంది. మెదడు దెబ్బతినటం డిప్రెషన్ లాంటి ఎంతో తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
Alcohol : ఆల్కహాల్ అధికంగా తాగటం వలన ఎలాంటి వ్యాధులు సంభవిస్తాయో తెలుసా…!
రక్తహీనత : అధిక ఆల్కహాల్ తాగే వారి శరీరంలో పోషకాల లోపం అనేది సంభవిస్తుంది. ఐరన్ లోపం వలన కూడా రక్తహీనతకు కారణం అవుతుంది. శరీరంలో రక్తం అనేది తక్కువ మోతాదులో ఉంటే బలహీనత, తల తిరగటం, అపస్మారక స్థితి లాంటి సమస్యలు కూడా దారి తీయవచ్చు..
క్యాన్సర్ : ఆల్కహాల్ కూడా క్యాన్సర్ తో డైరెక్ట్ గా సంబంధం కలిగి ఉంటుంది. నిజం. ఆల్కహాల్ అధికంగా తాగే వ్యక్తులు నోటిలో, గొంతులో, వాయిస్ బాక్స్, ఫుడ్ పైప్ లు కూడా క్యాన్సర్ బారిన పడతాయి. ఇది కాక కాలేయం, బ్రెస్ట్ క్యాన్సర్,ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.