Renu Desai : రేణూ దేశాయ్ ప్రస్తుతం విదేశాల్లో ఎంతగా తిరిగేస్తోందో అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఫారిన్‌లోనే తిరిగేస్తోంది. స్కాట్లాండ్, యూరప్ దేశాలు అంటూ అక్కడి వీధుల్లోనే చక్కర్లు కొడుతోంది.అకిరా, ఆద్యలతో కలిసి రేణూదేశాయ్ అక్కడ ఎంజాయ్ చేస్తోంది. మామూలుగా అయితే రేణూ దేశాయ్ ఆధ్యాత్మిక టూర్‌లు వేస్తుంటుంది. కాశీ, హిమాలయాలు అంటూ రేణూ దేశాయ్ తిరుగుతుంటుంది. కానీ ఇలా ఫారిన్ టూర్ వేయడం వెనక ఉద్దేశ్యం ఏంటో తెలియడం లేదు. మొత్తానికి ఇప్పుడు రేణూ దేశాయ్ మాత్రం ఫారిన్‌లో చక్కర్లు కొడుతోంది. రేణూ దేశాయ్ తన కొడుకు అకిరాను ఫారిన్ కంట్రీలోనే చదువు చెప్పించాలని చూస్తున్నట్టుంది. అందుకే ఇలా అక్కడ ఇన్ని రోజులు ఉండి..
అకిరా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. అసలే అకీరా గత రెండు నెలల క్రితం ప్లస్ 2 కంప్లీట్ చేశాడు. ఇక ఇప్పుడు అకిరా తనకు ఇష్టమైన మ్యూజిక్‌ను నేర్చుకుంటాడో.. లేదో ఇంకా ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటాడో.. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అంటూ ఇంకా ఏదైనా ప్రయత్నిస్తాడో చూడాలి. రేణూ దేశాయ్ ఈ మధ్య మాత్రం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంటోంది. మామూలుగా అయితే రేణూ దేశాయ్ నెట్టింట్లో అంత యాక్టివ్‌గా ఉండదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉండేది. అయితే మూడో వేవ్‌లో రేణూ దేశాయ్ కరోనా బారిన పడింది. దీంతో రేణూ దేశాయ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది.
అలా మధ్యలో చాలా రోజులే సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రేణూ దేశాయ్.. ఇప్పుడు మళ్లీ ఫుల్ యాక్టివ్ అయింది. గత కొన్ని రోజులు ఫారిన్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటలు, వీడియోలు, రీల్ వీడియోలతో హంగామా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఓ పోస్ట్ వేసింది. మన ఇండియన్స్ అంటే.. ఎక్కువగా చాయ్ బిస్కెట్స్ తింటుంటారు.. అందులోనూ కొంత మంది పార్లేజీ బిస్కెట్స్ చాయ్ కాంబోను ఇష్టపడుతుంటారు. కానీ ఇవి ఫారిన్ కంట్రీలో అంతగా ఉండవు. ఇదే విషయాన్ని ఇప్పుడు రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. చాయ్ బిస్కెట్ అనేది కాంబినేషన్, దాన్ని మిస్ అవుతుండటం చాలా కష్టం.. అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.