Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు నా ద‌గ్గ‌ర తేవొద్దు.. నాకున్నంత ప్రేమ ఆయ‌న‌కి లేదన్న రేణూ దేశాయ్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు నా ద‌గ్గ‌ర తేవొద్దు.. నాకున్నంత ప్రేమ ఆయ‌న‌కి లేదన్న రేణూ దేశాయ్..!

Renu Desai : రేణు దేశాయ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన ఈమెను ఇప్పటికీ అంతా వదినా అనే పిలుస్తున్నారు. తన అభిమాన హీరో భార్యగానే భావిస్తూ.. సపోర్ట్ చేస్తున్నారు. దంపతులుగా రేణు దేశాయ్- పవన్ కల్యాణ్ విడిపోయి వారి జీవితాలను వాళ్లు జీవిస్తున్నారు. కానీ, అభిమానం పేరుతో ఇప్పటికీ రేణూ దేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ నుంచి […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 May 2024,1:00 pm

Renu Desai : రేణు దేశాయ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన ఈమెను ఇప్పటికీ అంతా వదినా అనే పిలుస్తున్నారు. తన అభిమాన హీరో భార్యగానే భావిస్తూ.. సపోర్ట్ చేస్తున్నారు. దంపతులుగా రేణు దేశాయ్- పవన్ కల్యాణ్ విడిపోయి వారి జీవితాలను వాళ్లు జీవిస్తున్నారు. కానీ, అభిమానం పేరుతో ఇప్పటికీ రేణూ దేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ఆవిడ ఏ పోస్ట్ పెట్టినా కామెంట్ సెక్షన్స్ లో నెగిటివ్ కామెంట్స్ తో విసిగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తాను చాలా మంది అకౌంట్స్ ని బ్లాక్ చేశానంటూ స్వయంగా రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

Renu Desai రేణూకి చిర్రెత్తుకొచ్చింది..

ఇప్పటికే పలుమార్లు పవన్ కల్యాణ్ తో పోలికలు, తాను చేసిన పనికి క్రెడిట్ ని పవన్ కల్యాణ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ నేరుగా చెప్పారు. కానీ, ఇంకా కొందరు తమ కామెంట్స్ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇటీవలే రేణు దేశాయ్ 3500 కావాలంటూ వీడియో పెట్టగా కొందరు పంపారు. మరికొందరేమో ఆమె అకౌంట్ హ్యాక్ చేశారని, మరికొందరేమో ఆమాత్రం కూడా ఆమె వద్ద లేవా అంటూ కామెంట్లు చేశారు. అయితే వీటన్నిటిపై స్పందిస్తూ.. ఆమె డబ్బులు ఎందుకు అడిగిందో చెప్పింది. తాను ఆ డబ్బులతో జంతువుల కోసం ఓ షెడ్ నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిస్తున్నారు. రేణూ దేశాయ్ చేసే మంచి పనుల్లోనూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దూరి.. ఇదంతా ఆయన క్రెడిట్. ఆయన మంచితనమే అని అంటుంటే.. రేణూ దేశాయ్‌కి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Renu Desai ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు నా ద‌గ్గ‌ర తేవొద్దు నాకున్నంత ప్రేమ ఆయ‌న‌కి లేదన్న రేణూ దేశాయ్

Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు నా ద‌గ్గ‌ర తేవొద్దు.. నాకున్నంత ప్రేమ ఆయ‌న‌కి లేదన్న రేణూ దేశాయ్..!

తనకు తోచిన పనులు, తనకు నచ్చిన పనులు చేసుకుంటూ, చేతనైన సాయం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తుంటే.. మధ్యలోకి వచ్చిన ఇదంతా పవన్ కళ్యాణ్ మంచితనమే అని అంటే.. రేణూ దేశాయ్‌కి మండిపోయినట్టుంది. రేణూ దేశాయ్ ఏదో తన పాటికి తాను బతికేస్తోంది. ఆమె ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రెడిట్ మాత్రం తమ హీరోకే ఇస్తుంటారు. తాజాగా అలానే ఓ అభిమాని కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు. దీంతో రేణూ దేశాయ్‌కి చిర్రెత్తుకొచ్చినట్టుంది. నేను ఏ పోస్ట్ వేసినా సరే కొంత మంది మాత్రం నా మాజీ భర్తను లాగి.. ఆయనతో పోల్చుతుంటారెందుకు? ఎంత మందిని ఎన్ని సార్లు బ్లాక్ చేయాలి.. యానిమల్ రెస్క్యూని గత పదేళ్ల నుంచి నేను చేస్తూనే ఉన్నా.. దానికి నా ఎక్స్ భర్తకు ఎలాంటి సంబంధం లేదు.. ఇకపై అయినా నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి.. జంతువుల మీద నాకున్నంత కేర్ గానీ, ప్రేమ గానీ ఆయనకు ఉండదు అని రేణూ దేశాయ్ స్పందించారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది