Renu Desai : సర్జరీ చేయించాలంటూ డొనేషన్ అడిగిన రేణూ దేశాయ్.. స్పందన చూసి ఆశ్చర్యం..!
Renu Desai : ఇటీవలి కాలంలో రేణూ దేశాయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె తన పిల్లల విషయంతో పాటు సేవా కార్యక్రమాల విషయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేణు దేశాయ్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన సంగతులను పంచుకుంటూ ఉంటుంది. అలాగే దేశ కాలమాన పరిస్ధితులపైనా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఇటీవల అకీరా నందన్‌పై నెగిటివ్ కామెంట్స్ పెట్టిన ఓ వ్యక్తిపై రేణూ దేశాయ్ విరుచుకుపడ్డారు. అకీరా ఫేస్ నచ్చకుంటే, చూడకు.. నీకు సిగ్గు లేకుండా నా అకౌంట్‌ను ఫాలో అవుతూ, నా కొడుకు మీద కామెంట్స్ చేస్తావంటూ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు తనపై జరిగే ట్రోలింగ్ చూసి కూతురు ఏడ్చిందంటూ పేర్కొంది.ఇక సోషల్ మీడియా ద్వారా ఫండింగ్ అడుగుతుంది. పెట్స్ కోసం సాయం చేయాలని కోరుతుంది. రేణూ దేశాయ్ తాజాగా ఓ పెట్‌కి సర్జరీ చేయించాలంటూ డొనేషన్ అడిగింది. ఈ మేరకు పెట్ పరిస్థితిని చూపిస్తూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టేశారు. విరాళం కావాలంటూ పోస్ట్ పెట్టారు. ఆ తరువాత కొద్ది సేపటికి రేణూ దేశాయ్ మళ్లీ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. మామూలుగా రేణూ దేశాయ్‌కి పదకొండు లక్షల మంది ఫాలోవర్లున్నారు. కానీ అందులో పది మంది మాత్రమే డొనేషన్ చేశారట. ఈ విషయం మీదే రేణూ దేశాయ్ స్పందించారు. ఇంకా చాలా మంది ఇస్తారని, ఎంతో మంది పెట్ లవర్స్ ఉన్నారని ఆశించిందట. కానీ పది మందే డొనేట్ చేశారని చెప్పుకొచ్చారు.
Renu Desai : సర్జరీ చేయించాలంటూ డొనేషన్ అడిగిన రేణూ దేశాయ్.. స్పందన చూసి ఆశ్చర్యం..!
చాలా మందికి పెట్స్ అంటే ఇష్టం ఉండటంతో ఎక్కువ మంది స్పందిస్తారని ఊహించానని.. అలాంటి ఈ రెస్పాన్స్ అంచనా వేయలేదని రేణూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఆమె ఫాలోవర్స్‌పై మండిపడుతున్నారు. వారికి ఏమాత్రం మనసు లేదని, మూగ జీవాలపై జాలి లేదని రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక రేణూ దేశాయ్ చివరిసారిగా టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో పలకరించింది. ప్రస్తుతం మాత్రం సైలెంట్‌గా ఉంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.