Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురిని ఏడ్పించిన మీమర్స్.. బాధ తట్టుకోలేక రేణూ దేశాయ్ ఫైర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురిని ఏడ్పించిన మీమర్స్.. బాధ తట్టుకోలేక రేణూ దేశాయ్ ఫైర్..!

Renu Desai : సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ నెటిజన్లతో ఓ మినీ యుద్దమే చేస్తుంది. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా రేణూ దేశాయ్‌ని నెటిజ‌న్స్ ట్రోల్ చేయ‌డం, వారికి ఆమె గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్‌ను వదిలేసి తప్పు చేశావ్ అంటూ.. మళ్లీ ఆయన దగ్గరికే వెళ్లొచ్చు కదా? అంటూ ఇలా ఉచిత సలహాలు ఇస్తుంటారు. గత వారం రోజులుగా ఇలాంటి సలహాలు వస్తూనే ఉన్నాయి. వాటిపై రేణూ దేశాయ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2024,5:10 pm

Renu Desai : సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ నెటిజన్లతో ఓ మినీ యుద్దమే చేస్తుంది. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా రేణూ దేశాయ్‌ని నెటిజ‌న్స్ ట్రోల్ చేయ‌డం, వారికి ఆమె గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్‌ను వదిలేసి తప్పు చేశావ్ అంటూ.. మళ్లీ ఆయన దగ్గరికే వెళ్లొచ్చు కదా? అంటూ ఇలా ఉచిత సలహాలు ఇస్తుంటారు. గత వారం రోజులుగా ఇలాంటి సలహాలు వస్తూనే ఉన్నాయి. వాటిపై రేణూ దేశాయ్ తన అభిప్రాయాన్ని చెబుతూనే వస్తున్నారు. తానేమీ విడాకులు అడగలేదని, తానేమీ విడిపోవాలని కోరుకోలేదంటూ.. ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారంటూ ఇలా నెటిజన్ల కామెంట్లకు రిప్లైలు ఇస్తూనే వస్తున్నారు. అకిరా నందన్ మీద ఇన్నాళ్లు ఎవ‌రు నెగెటివ్ కామెంట్ చేయ‌లేదు.

Renu Desai ఏడుపు త‌గులుతుంది..

అయితే అకిరా టాలెంట్ గురించి అందరికీ చూపిస్తూ.. అతని సోషల్ మీడియా అకౌంట్లో వీడియో పోస్ట్ చేయ‌గా, దానికి నెగెటివ్ కామెంట్స్ చేశారు. దాంతో రేణూ దేశాయ్‌కి మండిపోయింది. తన కొడుకుని ఇలా అనే సరికి ఆగ్రహం కట్టలు తెంచుకుని వచ్చేసింది. సదరు నెటిజన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చి చీవాట్లు పెట్టేశారు. పిల్లల జోలికొస్తే తల్లి చూస్తూ ఊరుకోదు అంతం చేస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చేశారు. నీ అమ్మ ఇలానే పెంచిందా?.. ఓ పిల్లాడు కెరీర్ ప్రారంభించక ముందే ఇలా మాట్లాడుతావా? అంటూ ఫైర్ అయింది. ఇక పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవాతో అకీరా, ఆద్య కలిసి తీసుకున్న ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేస్తూ రేణూపై మీమ్స్ క్రియేట్ చేశారు.

Renu Desai ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురిని ఏడ్పించిన మీమర్స్ బాధ తట్టుకోలేక రేణూ దేశాయ్ ఫైర్

Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురిని ఏడ్పించిన మీమర్స్.. బాధ తట్టుకోలేక రేణూ దేశాయ్ ఫైర్..!

వారు చేసిన మీమ్స్ వల‌న తన కూతురు ఎంతో ఏడ్చిందంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. మీకు కుటుంబాలు లేవా అంటూ వారిని ప్రశ్నించారు. అసలు మీకు ఎమోషన్స్ లేవా? ఈ ఫొటోను నేను క్రాప్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ జోకులు వేస్తూ ఇష్టమొచ్చినట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తారా? తన తల్లి గురించి జోకులు వేస్తూ పెట్టిన ఓ పోస్ట్ చూసి నా కూతురు ఆద్య ఏడ్చింది. మీకు కూడా అమ్మ, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారు కదా. నిజంగా మనషులు ఇంతలా జంతువుల్లా ఎలా మారిపోతున్నారో అర్థం కావడం లేదు. కేవలం మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది కదా అని.. సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి ఏమైనా పోస్ట్ చేస్తారా?” అంటూ రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు. ఈ పోస్ట్ పెట్టే ముందు ఒక 100 సార్లు నేను ఆలోచించాను. కానీ నా కూతురు పడిన బాధ చూసి పెట్టకుండా ఉండలేకపోయాను అని రేణూ స్ప‌ష్టం చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది