Kalki 2898 AD Movie : ప్రీమియ‌ర్ షోల‌తో విధ్వంసం సృష్టించిన క‌ల్కి.. ఇక రికార్డులు అన్ని బ‌ద్ద‌లు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kalki 2898 AD Movie : ప్రీమియ‌ర్ షోల‌తో విధ్వంసం సృష్టించిన క‌ల్కి.. ఇక రికార్డులు అన్ని బ‌ద్ద‌లు

Kalki 2898 AD Movie : ఇంకొద్ది గంట‌ల‌లో ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం కొన్నాళ్లుగా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి రోజే ఈ సినిమా చూడాల‌ని ప్రేక్ష‌కులు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. జూన్ 26 వ తేదీన నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2024,11:00 am

Kalki 2898 AD Movie : ఇంకొద్ది గంట‌ల‌లో ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం కొన్నాళ్లుగా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి రోజే ఈ సినిమా చూడాల‌ని ప్రేక్ష‌కులు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. జూన్ 26 వ తేదీన నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే ఈ షోలకి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.ఇప్పటి వరకూ ప్రీమియర్ షో లకు లక్ష టికెట్లు అమ్ముడు పోయాయి. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. ప్రీమియర్ షోలు స్టార్ట్ కావడానికి ముందుగా, ఈ చిత్రం ఇంకెలాంటి రికార్డు లను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Kalki 2898 AD Movie రికార్డుల కల్కి..

దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద థియేటర్ ఫ్రాంచైజ్‌లు అయిన పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్‌లో మొత్తంగా 37 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. మూవీ రిలీజ్ అయ్యే ముందు రోజు వరకు ఈ ప్రీ బుకింగ్ హడావిడి కొనసాగేలా ఉంది. బుధవారం పూర్తయ్యేలోపు కేవలం హిందీ వర్షన్‌లోనే 1.35 లక్షల టికెట్లు బుక్ అవ్వనున్నట్టు ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘కల్కి 2898 AD’ పోస్టర్స్, ట్రైలర్ చూస్తుంటే ఇదొక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీ అని అంద‌రు భావిస్తున్నారు. ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ కావ‌డానికి కార‌ణం ప్రభాస్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.తెలుగు, హిందీ రేంజ్‌లో తమిళంలో ‘కల్కి 2898 AD’ ప్రీ బుకింగ్స్ కనిపించడం లేదు.

Kalki 2898 AD Movie ప్రీమియ‌ర్ షోల‌తో విధ్వంసం సృష్టించిన క‌ల్కి ఇక రికార్డులు అన్ని బ‌ద్ద‌లు

Kalki 2898 AD Movie : ప్రీమియ‌ర్ షోల‌తో విధ్వంసం సృష్టించిన క‌ల్కి.. ఇక రికార్డులు అన్ని బ‌ద్ద‌లు

ఇప్పటికే పలు థియేటర్లలో 1000 టికెట్లకుపైగా అమ్ముడుపోయాయని తెలుస్తోంది. రిలీజ్‌కు ఒకరోజు ముందు కచ్చితంగా ఈ నెంబర్ పెరుగుతుందని నిపుణులు అనుకుంటున్నారు. వీటన్నింటిని చూస్తుంటే ‘కల్కి 2898 AD’ కలెక్షన్స్ అనేవి మొదటిరోజే రూ.110 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక కర్ణాటక, తమిళనాడులో కూడా మూవీకి బుకింగ్స్ పెరిగితే ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తే.. ‘కల్కి 2898 AD’ ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఈ చిత్రం లో దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచ‌నాలు పెంచాయి.

No liveblog updates yet.

LIVE UPDATES

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది