Sudigali Sudheer : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ ప్ర‌శ్న వేసిన సుడిగాలి సుధీర్.. అంతా బిత్త‌ర‌పోయారుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ ప్ర‌శ్న వేసిన సుడిగాలి సుధీర్.. అంతా బిత్త‌ర‌పోయారుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2024,3:49 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెర షో జ‌బర్ధ‌స్త్ తో మంచి క్రేజ్ అంది పుచ్చుకున్న సుధీర్ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు. వ‌రుస సినిమా అవ‌కాశాలు రావ‌డంతో సుధీర్ షోల‌కి మ‌ధ్య‌లో బ్రేక్ ఇచ్చాడు ఇప్పుడు మ‌ళ్లీ బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్నాడు. సర్కార్ సీజన్ 4 కు సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. మూడు సీజన్స్ కు ప్రదీప్ యాంకరింగ్ చేశాడు. అప్పుడు అసలు ఇలాంటి సీజ‌న్ ఉందని కూడా తెలియ‌దు. సుధీర్ వ‌చ్చాక దీనిపై బాగా క్రేజ్ వ‌చ్చింది.ఆటగాడు మారాడు.. ఆట మారింది అన్న డైలాగ్ తోనే సుధీర్ మంచి హైప్ తెచ్చాడు.

Sudigali Sudheer సుధీర్ ర‌చ్చ‌..

ఇక తన కామెడీ టైమింగ్ తో, పంచ్ లతో షో మొత్తాన్ని తన వైపుకు తిప్పేసుకుంటాడు. ఇప్పుడు సర్కార్ సీజన్ 4 లో కూడా అదే జరుగుతుంది. ఇప్పటివరకు 10ఎపిసోడ్స్ ను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న సర్కార్ షో.. తాజాగా పదకొండో ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ‘సర్కార్ 4’ 11వ ఎపిసోడ్ కోసం అనసూయ భరద్వాజ్, డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్, సింగర్స్ మనో, గీతా మాధురిలను తీసుకు వచ్చారు. షోలో అనసూయ ఎంట్రీ ఇచ్చినప్పుడు ‘ఏంటండీ మీరు ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చారు’ అని సుధీర్ కాంప్లిమెంట్ ఇవ్వగా… ‘యాంకర్ నువ్వు అని తెలియక సెటైర్ వేసింది. ఆ తర్వాత వచ్చిన బాబా భాస్కర్ అయితే ‘ప్రదీప్ ఎక్కడ’ అంటూ కామెడీ చేశారు.

Sudigali Sudheer ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ ప్ర‌శ్న వేసిన సుడిగాలి సుధీర్ అంతా బిత్త‌ర‌పోయారుగా

Sudigali Sudheer : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ ప్ర‌శ్న వేసిన సుడిగాలి సుధీర్.. అంతా బిత్త‌ర‌పోయారుగా..!

ప్రోమోలో ‘ఈ ఎమ్మెల్యే ఎవరు అయితే ఉన్నారో? వాళ్ళ అన్నయ్య కూడా హీరోనే’ అని ఒక ప్రశ్న అడిగాడు సుధీర్. ఆ తర్వాత బాలకృష్ణకు సంబంధించి మరొక ప్రశ్న అడిగారు. ప్రోమో చివర్లో పవన్ మీద రోజా చేసిన కామెంట్స్ చెప్పి ఊరుకున్నారు. మరి, ఆ ప్రశ్న ఏమిటి? అనేది ఆహాలో చూడాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని నటి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్ ఆహా గేమ్ షోలో కాక పుట్టించింది. ఫుల్ ఎపిసోడ్ ప్రేక్షకుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డం ఖాయంగా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది