Renu Desai : అందరినీ వేడుకున్న రేణూ దేశాయ్.. అకీరా నందన్ పిక్స్ వైరల్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 10, 2022, 7:00 pm

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది..ఎప్పుడు మాయం అవుతుందో చెప్పడం కష్టం. కరోనా సమయంలో కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. మధ్యలో బిజీగా మారింది. కొన్ని సార్లు మొత్తానికే కనిపించకుండా పోయింది. అలా రేణూ దేశాయ్ మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటుంది. రేణూ దేశాయ్ షేర్ చేసే ఫోటోలన్నీ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే అందులో అకీరా నందన్ ఉంటాడు కాబట్టి. ఇక మొన్నా మధ్య షేర్ చేసిన పిక్ మాత్రం ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయింది. అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు.

అలా పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్, ఆద్య, అకీరా నందన్ కలిసి కనిపించిన ఫోటో అందరినీ ఆశ్చర్యపరించింది. అకీరా నందన్ గురించి, అతడి గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వడం గురించి రేణూ దేశాయ్ పోస్ట్ చేసింది. ఇక ఆ కార్యక్రమంలో అకీరా నందన్ ఇచ్చిన స్పీచు, తన ఫ్రెండ్స్ కోసం ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటను.. పియానో మీద ప్లే చేసి ఆడిటోరియంను దద్దరిల్లేలా చేసేశాడు. మొత్తానికి అకీరా నందన్ మాత్రం ఆ రోజు హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి అకీరా నందన్ హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో అచ్చం పవన్ కళ్యాణ్‌లానే కనిపించాడు. ఆ బొట్టు పెట్టుకున్నవిధానం, ఆ చూపులు అన్నీ కూడా పవన్ కళ్యాణ్‌ని గుర్తుకు చేస్తున్నాయి. మొత్తానికి అకీరా మాత్రం అభిమానులను ఇలా అలరిస్తున్నాడు.

Renu Desai Shares Akira Nandan Pics And ABout Plastic usage Environment

Renu Desai Shares Akira Nandan Pics And ABout Plastic usage Environment

జూనియర్ పవర్ స్టార్ అనే ట్యాగ్‌ను ఇప్పుడే సంపాదించేసుకున్నాడు. ఇక అకీరా ఎంట్రీ గనుక అయితే సిల్వర్ స్క్రీన్ మాత్రం ఓ రేంజ్‌లో సంబరాలు చేసుకునేలా ఉంది. ఇక రేణూ దేశాయ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కొబ్బరి బొండం నీళ్లు తాగడానికి ఇదే మంచి పద్దతి.. స్ట్రాలు, ప్లాస్టిక్ గ్లాస్ వద్దు. ప్రకృతికి నష్టం కలిగించొద్దు. ఇషా ఫౌండేషన్ నుంచి కోయంబత్తూర్ ఎయిర్ పోర్టుకు వస్తుండగా దారి మధ్యలో ఈమె కొబ్బరి బోండాలు అమ్ముతూ కనిపించింది. ఆమెను ఓ ఫోటో తీసుకోవచ్చా? అని అడిగాను. దానికి ఎంతో సంతోషపడింది. సంతోషంగా ఉండేందుకు మనకు ఎక్కువ డబ్బేమీ ఉండాల్సిన అవసరం లేదని ఆమెను చూస్తే నాకు అనిపించింది..అంటూ రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ మీద లైకుల వర్షం కురుస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp