Renu Desai Mahesh Babu : సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న రేణు దేశాయ్.. మహేష్ బాబు సినిమా చేజారడానికి కారణం ఇదే
ప్రధానాంశాలు:
Renu Desai Mahesh Babu : సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న రేణు దేశాయ్.. మహేష్ బాబు సినిమా చేజారడానికి కారణం ఇదే
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన జానీ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాల సమయంలోనే పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడ్డ రేణు, ఆయనను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ప్రస్తుతం పవన్‌కు దూరంగా, తన పిల్లలతో కలిసి స్వతంత్రంగా జీవిస్తున్నారు. పిల్లల భవిష్యత్తే ప్రధాన లక్ష్యంగా జీవితం కొనసాగిస్తున్న రేణు దేశాయ్, అదే సమయంలో తన వ్యక్తిగత జీవితాన్ని సమతూకంగా నిర్వహిస్తూ మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉండే రేణు, తన పిల్లలతో గడిపే మధుర క్షణాలను అభిమానులతో షేర్ చేస్తూ దగ్గరగా ఉంటున్నారు.
Renu Desai Mahesh Babu : సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న రేణు దేశాయ్.. మహేష్ బాబు సినిమా చేజారడానికి కారణం ఇదే
Renu Desai Mahesh Babu : అవి బయటపెట్టలేను..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్, తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆమెకు, ఆ తర్వాత కూడా పలు అవకాశాలు వచ్చాయని తెలిపారు.ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కూడా తనను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించారని రేణు వెల్లడించారు. ఆ పాత్ర తనకు చాలా నచ్చిందని, నటించాలనే ఆసక్తి కూడా ఉందని చెప్పింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేకపోయానని పేర్కొన్నారు.
ఆ వ్యక్తిగత కారణాల వివరాలను మాత్రం బయటపెట్టలేదు రేణు దేశాయ్. వాటి గురించి మాట్లాడితే అనవసర వివాదాలు తలెత్తే అవకాశం ఉందని భావించి, ఆ విషయాలను గోప్యంగా ఉంచుతున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.దీంతో అభిమానుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. నిజంగా వ్యక్తిగత కారణాలేనా? లేక ఆ అవకాశం చేజారిపోవడానికి మరేదైనా కారణముందా? అనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్ కనిపించకపోవడంపై అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.