Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో యాంకర్ రష్మితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. రాజకీయ ప్రవేశంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, తాను సామాజిక అంశాలపై మాత్రమే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నానని, రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని తెలిపారు. ఈ సందర్భంగా వీధి కుక్కల హత్యలపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కుక్క కరిస్తే వందల సంఖ్యలో కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. “ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడితే అందరు మగవాళ్లను రేపిస్టులు, హంతకులుగా పరిగణిస్తారా?” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కుక్క కాటు కారణంగా మనిషి మృతి చెందితే వెంటనే స్పందించే వ్యవస్థలు, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, చిన్నారులపై అత్యాచారాల విషయంలో ఎందుకు అదే స్థాయిలో స్పందించడం లేదని నిలదీశారు.
Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్
Renu Desai : రేణు ఆగ్రహం..
ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ వందల సంఖ్యలో వీధి కుక్కలను చంపించిన ఘటనను ప్రస్తావించిన ఆమె, కుక్క, ఆవు, గేదె, పిల్లి, కోతి—all ఇవన్నీ ప్రాణులే కాదా? అంటూ ప్రశ్నించారు. వీధి కుక్కల సంఖ్య పెరగడానికి కారణం వాటి తప్పు కాదని, మన చుట్టూ ఉన్న అపరిశుభ్ర పరిస్థితులే ప్రధాన కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. చెత్త నిర్వహణ సరిగా లేకపోవడం, ఆహార వ్యర్థాలు రోడ్లపై ఉండటమే ఈ సమస్యకు మూలమని పేర్కొన్నారు. కాలభైరవుడిని పూజించే సమాజం అదే సమయంలో కుక్కలను చంపడం ఎంతటి విరుద్ధతనని వ్యాఖ్యానించారు. రోజూ వాహనాలు ఢీకొనడంతో వందల సంఖ్యలో కుక్కలు గాయపడుతున్నాయని, వాటికి న్యాయం కోరేందుకు అవి ఎవరి వద్దకు వెళ్లాలని ప్రశ్నించారు. తాను ఈ విషయాలపై గట్టిగా మాట్లాడినందుకు జైలుకు పంపినా భయపడనని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.
ఈ ప్రెస్ మీట్ వల్ల తనపై నెగిటివిటీ పెరుగుతుందని తెలిసినా, కనీసం ఒక్కరైనా మారతారనే ఆశతోనే మాట్లాడుతున్నానని ఆమె చెప్పారు. ప్రభుత్వం వీధి కుక్కల కోసం ప్రత్యేక షెల్టర్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విదేశీ బ్రీడ్స్ కుక్కలను పెంచుకునే యజమానులు కూడా బాధ్యతగా వ్యవహరించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మీడియా ప్రతినిధులపై అరవడంపై రేణుదేశాయ్ క్లారిటీ
నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు.. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు
అతను నా మీద అరిచాడు, అందుకే నేను తిరిగి అరిచాను. దీనిలోకి నా పర్సనల్ జీవితాన్ని ముడిపెట్టకండి, నా పిల్లలను లాగవద్దు – #RenuDesai pic.twitter.com/vHXwXnZGNY
— greatandhra (@greatandhranews) January 19, 2026